భర్తలూ... ఇవి పాటించండి!

గర్భంతో ఉన్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటే కడుపులో పాపాయి అంత ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతుంది. అంతే కాదు, ఈ సమయంలోనే కాబోయే తల్లిదండ్రులిద్దరికీ ఒకరిపై ఒకరికి అనురాగం పెరుగుతుంది. కాబట్టి భార్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటున్నాయి అధ్యయనాలు.

Published : 19 Feb 2024 01:58 IST

గర్భంతో ఉన్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటే కడుపులో పాపాయి అంత ఆరోగ్యంగా, ఆనందంగా పెరుగుతుంది. అంతే కాదు, ఈ సమయంలోనే కాబోయే తల్లిదండ్రులిద్దరికీ ఒకరిపై ఒకరికి అనురాగం పెరుగుతుంది. కాబట్టి భార్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంటున్నాయి అధ్యయనాలు.

అన్నిటి కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. పైగా ఈ సమయంలోనే ఆమె మనసులో ఉన్న కోరికలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు ప్రయత్నించాలట. అప్పుడే కొత్త ప్రపంచానికి స్వాగతం పలకగలరు. ఈ సమయంలో వచ్చే మార్పులు.. అంటే ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యలు, శరీరంలో జరిగే అనేక మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. మామూలుగా అయితే మగవారికి అవి అర్థం కావడం కష్టమే కానీ.. కొత్తగా తండ్రి కాబోతున్న వారు మాత్రం ఇవి అర్థం చేసుకోవాలి. మధ్య మధ్యలో ‘ఎలా ఉంది, ఏమైనా తింటవా’ అనే మీ పలకరింపు వారిని మరింత ఉత్సాహంగా ఉంచుతుంది. ఆ సమయంలో ఇలాంటి మాటలే భార్యకు ఊరటనిస్తాయి.

  • చాలామంది భర్తలు ఉద్యోగంలో పడి భార్య ఆరోగ్యాన్ని మరచిపోతారు... మీరూ ఆ తప్పే చేస్తున్నారా! అది మంచిది కాదు మార్చుకోవాలి. ఈ సమయంలో వారి ఆరోగ్య పరిస్థితుల రీత్యా వారిని అంటిపెట్టుకుని ఉండాలి. సమయం లేదని వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
  • నెలలు నిండేకొద్దీ కొంతమందిలో వెన్ను, కాళ్ల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. మసాజ్‌ ద్వారా వాటికి ఉపశమనం లభిస్తుంది. మీ భాగస్వామికి మీరే స్వయంగా మర్దనా చేయండి. అది తనకెంతో ధైర్యాన్నిస్తుంది. ఈ సమయంలో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇందుకుగానూ ఆమె మనసుకు హాయిగొలిపే ప్రదేశాలకు అంటే.. రొమాంటిక్‌ డేట్‌కు తీసుకెళ్లండి. ఇప్పుడు డేట్‌ ఏంటీ అనుకుంటున్నారా..! ఈ సమయంలో భర్త ఇచ్చే ధైర్యం చాలా అవసరం. ఇందుకు కనీసం వారానికోసారైనా ఆమెను బయటికి తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే పుట్టబోయే బిడ్డతో పాటు ఆమెకూడా శారీరకంగానూ, మానసికంగానూ, ఆరోగ్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్