కలిసి నడుద్దాం..!

భార్యాభర్తల అనుబంధానికి ప్రత్యేక నిబంధనలంటూ ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవాలి. ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది.

Updated : 21 Feb 2024 04:26 IST

భార్యాభర్తల అనుబంధానికి ప్రత్యేక నిబంధనలంటూ ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకోవాలి. ఒకరి ఇష్టాలను ఒకరు పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది.

  • ఇరువురివీ వేరువేరు నేపథ్యాలు.. భిన్న అలవాట్లు, అభిరుచులు ఉండొచ్చు. అలా అని నాకు నచ్చినట్లే ఉండాలంటే దాంపత్యంలో అవ్వదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎక్కువ వివాదాలు జరుగుతుంటాయి. ఇద్దరి మధ్యా అలాంటివి రాకూడదంటే కలిసి ప్రణాళిక వేసుకోవాలి. అంటే.. అవసరం, ఆడంబరాల మధ్య తేడాలను గుర్తించి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రమే చిన్న చిన్న సమస్యలను సులువుగా అధిగమించగలుగుతాం. దీంతో ఆర్థిక అంశాలపై క్రమశిక్షణా పెరుగుతుంది.
  • నమ్మకం, భరోసా... ఒకరికొకరు జీవితాంతం ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ సాగాలి. కొన్నిసార్లు మనకు చిన్న విషయమే అనిపించొచ్చు.. కానీ ఎదుటి వారిలో నమ్మకానికి భంగం కలిగే ప్రమాదం లేకపోలేదు.. అందుకే పారదర్శకంగా ఉండాలి. అపార్ధాలను, అపోహలనూ తొలగించే ప్రయత్నం చేయాలి.
  • కొన్నిసార్లు కోపంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం. అవి తీవ్ర అనర్థాలకు దారితీస్తాయి. కొన్ని విషయాలను ప్రేమతో మాత్రమే సాధించగలం. భాగస్వామిలోని తప్పులను చెప్పాలనుకుంటే కోపం, ఆవేశంతో కాకుండా సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. లేనిపోని  పంతాలకు పోతే ఇద్దరి మధ్యా మరింత దూరం పెరుగుతుంది. ఇరువురు ప్రేమను పంచుకుంటూ, అర్థం చేసుకుంటూ అడుగులేస్తే జీవితం ఆనందంగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్