ప్రేమ ముద్ర వేసేద్దాం...

ఇల్లు, ఉద్యోగం, ఇతరత్రా వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారా! ఒక్క నిమిషం ఆగండి. అవన్నీ ఎప్పుడూ ఉండేవే కదా. వారాంతాల్లో అయినా సరదాగా మీ భాగస్వామితో అలా ఏ డిన్నర్‌కో,  విహారయాత్రకో వెళ్లిరండి. ఏంటి ప్రత్యేకించి చెబుతున్నారు అనుకుంటున్నారా...అందుకూ ఓ కారణం ఉంది.

Published : 28 Feb 2024 01:28 IST

ఇల్లు, ఉద్యోగం, ఇతరత్రా వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారా! ఒక్క నిమిషం ఆగండి. అవన్నీ ఎప్పుడూ ఉండేవే కదా. వారాంతాల్లో అయినా సరదాగా మీ భాగస్వామితో అలా ఏ డిన్నర్‌కో,  విహారయాత్రకో వెళ్లిరండి. ఏంటి ప్రత్యేకించి చెబుతున్నారు అనుకుంటున్నారా...అందుకూ ఓ కారణం ఉంది. అదేంటంటే మనకిష్టమైన వారితో సమయం గడపటం వల్ల ఆనందాన్ని కలిగించే డోపమైన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయి, అది మెదడులో ప్రత్యేకమైన రసాయనిక ముద్రను ఏర్పరుస్తుందట. అది బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. అయితే భాగస్వామి నుంచి విడిపోయినప్పుడు...ఆ ముద్ర నెమ్మదిగా మాయమవుతుందట. కాబట్టి మనం భాగస్వామితో మాట్లాడే ప్రతి మాటా ప్రతి పనీ ఒకరకంగా చెప్పాలంటే మన ప్రవర్తన వాళ్ల మెదడుపై చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ల మనసులో ప్రేమ ముద్రను అలానే ఉంచాలా, చెరపాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. చూసుకోండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్