మాటే మంత్రం..!

పిల్లల ఎదుగుదలలో భాషా నైపుణ్యాలు చాలా కీలకం. అందుకోసం వారికి బొమ్మల పుస్తకాలు చూపిస్తూ ఉంటాం.

Published : 29 Feb 2024 01:56 IST

పిల్లల ఎదుగుదలలో భాషా నైపుణ్యాలు చాలా కీలకం. అందుకోసం వారికి బొమ్మల పుస్తకాలు చూపిస్తూ ఉంటాం. అయితే వాటినే పదేపదే చూడాలంటే పిల్లలకు బోర్‌ కొట్టొచ్చు. అందుకు ప్రత్యామ్నాయంగా గతంలో మనకు జరిగిన సంఘటనలను సున్నితంగా వారితో పంచుకోమంటున్నారు పరిశోధకులు. అలా చేస్తే ప్రీస్కూల్‌ పిల్లల భాషా నైపుణ్యాలు పెరుగుతాయని ఫ్లోరిడా అట్లాంటిక్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది. కొంతమంది తల్లిదండ్రులకూ, 3-5 ఏళ్ల పిల్లలకూ మూడు రకాల యాక్టివిటీలను ఇచ్చారు. బొమ్మల పుస్తకాలు, లెగో బ్రిక్స్‌, గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడటం..వంటి యాక్టివిటీలు ఇచ్చారు. బొమ్మల పుస్తకాలు చూపిస్తూ మాట్లాడితే వచ్చేలాంటి ప్రయోజనాలే, గతంలో జరిగిన విషయాలను చర్చించినప్పుడూ వచ్చాయట. అమ్మ, నాన్న ఇద్దరిలో ఎవరు మాట్లాడినా ఫలితాల్లో తేడా లేదట. అందుకే పిల్లలతో కేవలం సమయం గడపడమే కాదు, దాన్ని ఎంత నాణ్యంగా గడుపుతున్నామన్నదీ ముఖ్యమే అంటున్నారు పరిశోధకులు. అందుకే పిల్లలను నిద్రపుచ్చేటప్పుడో లేదా మీకు కుదిరిన సమయంలో గతంలో జరిగిన విషయాల గురించి వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్లలో భాషా నైపుణ్యాలు పెరగటమే కాదు ఊహాశక్తీ పెరుగుతుందట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్