నచ్చితే కలిసి ఉండొచ్చు...!

మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకుపోతున్నా వాళ్లపై అణచివేత జరుగుతూనే ఉంది. దాంతో ఆత్మహత్యలు, విడాకుల సంఖ్య పెరుగుతోంది. మనువాడినవాడితో వేగలేక బంధం నుంచి బయటకు అడుగుపెడుతున్నారు.

Updated : 16 Mar 2024 15:22 IST

మహిళలు అన్నిరంగాల్లోనూ దూసుకుపోతున్నా వాళ్లపై అణచివేత జరుగుతూనే ఉంది. దాంతో ఆత్మహత్యలు, విడాకుల సంఖ్య పెరుగుతోంది. మనువాడినవాడితో వేగలేక బంధం నుంచి బయటకు అడుగుపెడుతున్నారు. అందుకే ముందుగానే భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకుంటోంది నేటి తరం. ‘సహజీవనం’ వైపు మొగ్గు చూపుతోంది. అయితే, ఈ సంప్రదాయం మన దేశంలో వేల ఏళ్ల కిత్రం నుంచే ఉందని తెలుసా...? నచ్చినవాడితో జీవితం ఆనందంగా గడపగలననే నమ్మకం వస్తేనే మూడు ముళ్లు వేయించుకోవడానికి ఆ మహిళలు ఒప్పుకొంటారట. వాళ్లెవరంటే...

రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో 70 ఏళ్ల నానియా గరాసియా 60 ఏళ్ల కాలీని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ నవ వధూవరులైనా... వీరి ప్రేమబంధం మాత్రం నలభైఏళ్ల క్రితమే ముడిపడిందట. కలిసి జీవిస్తూ... కొడుకుల్నీ, కూతుళ్లనీ, మనవల్నీ ఎత్తుకున్నారట. ఇప్పటివరకు లివింగ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న కాలీ తనకు నానియా సరైన భర్త అని నమ్మి ఇటీవలే మూడు ముళ్లూ వేయించుకోవడానికి ఒప్పుకొందట. అంతేకాదు, వీరి పిల్లలు కూడా అప్పటివరకు కలిసి జీవిస్తున్న తమ తమ భాగస్వాములను అదే రోజు వివాహం చేసుకున్నారట. వీళ్లే కాదు, గరాసియా తెగవారందరి జీవనశైలి ఇలాగే ఉంటుందని తెలిసి ఆధునిక సమాజం విస్తుబోయింది.

ఏళ్లనాటి సంప్రదాయం...

గుజరాత్‌, రాజస్థాన్‌ల్లోని మారుమూల గ్రామాల్లో నివసించే గరాసియా గిరిజన తెగ ఈ సంప్రదాయాన్ని వేల ఏళ్ల నుంచీ పాటిస్తోంది.  ఏటా ఇక్కడ రెండురోజులపాటు ఏర్పాటు చేసే కార్యక్రమంలో యువతీయువకులు తమకు నచ్చినవారితో కలిసి దూరంగా వెళ్లి జీవించొచ్చు. కొన్ని రోజుల తరవాత తిరిగి అదే ఊరికి రావొచ్చు. సహజీవనం చేస్తోన్న వ్యక్తి జీవితాంతం ఆర్థికంగా తోడుంటాడు, ప్రేమిస్తాడనే నమ్మకం ఆ మహిళకు వస్తేనే ఆ జంట పెళ్లి పీటలెక్కుతుంది. నచ్చకపోతే తిరస్కరించే స్వేచ్ఛ అక్కడి మహిళలకుంటుంది. ఆ నమ్మకం రానంతకాలం.. కలిసి జీవిస్తారు తప్ప, భార్యాభర్తలు కారు. ‘డపా’గా పిలిచే ఈ సంప్రదాయాన్ని పాటించడంలో ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదక్కడ. వివక్ష, లింగ ఆధారిత పక్షపాతం వంటి వాటికి తమ సంప్రదాయంలో చోటు లేదని చెబుతోన్న గరాసియా తెగని చూస్తే మీకేమనిపిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్