చిన్నవే... చక్కదిద్దుతాయి!

ఆనందంగా సాగే దాంపత్యం... ఇదేగా ఏ జంటైనా కోరుకునేది. దీనికోసం పెద్ద పెద్ద త్యాగాలే చేయక్కర్లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు చాలు ఆ ప్రయాణం సజావుగా సాగేలా చేస్తుంది అంటారు నిపుణులు. ఎలాగంటే...

Published : 17 Mar 2024 01:56 IST

ఆనందంగా సాగే దాంపత్యం... ఇదేగా ఏ జంటైనా కోరుకునేది. దీనికోసం పెద్ద పెద్ద త్యాగాలే చేయక్కర్లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు చాలు ఆ ప్రయాణం సజావుగా సాగేలా చేస్తుంది అంటారు నిపుణులు. ఎలాగంటే...

  • ‘ఎన్నిసార్లు చేసినా కాల్‌ లిఫ్ట్‌ చేయరు’ చాలామంది భార్యల నుంచి వచ్చే ఫిర్యాదే ఇది. అవతలి నుంచేమో ‘బిజీగా ఉన్నా. ఆ మాత్రం అర్థం కాదా’ అన్న సమాధానం వచ్చేస్తుంది. చిన్న సమస్యగానే కనిపిస్తుంది కానీ... ఆ కొద్ది సమయంలో ఏదైనా చెడు జరిగిందేమోనన్న భయం, తమని నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధ... ఇలా వాళ్ల మనసులో ఎన్ని నెగెటివ్‌ ఆలోచనలు తలెత్తుతాయో తెలుసా? అలాంటప్పుడు ‘మీటింగ్‌లో ఉన్నాను. మళ్లీ చేస్తాను’ అని చెప్పి పెట్టేయొచ్చు. లేదా మెసేజ్‌ చేసినా మంచిదే. నెగెటివ్‌ ఆలోచనలకు తావుండదు.
  • ‘పొసెసివ్‌నెస్‌’ అని అందమైన పేరు పెట్టినా... ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చెక్‌ చేయడం అనుమానం కిందే లెక్క. సరిగా సమయం కేటాయించట్లేదు, ఫోన్‌లోనే ఉండిపోతున్నారనిపిస్తే సాయంత్రం ఫలానా సమయం తర్వాత నో ఫోన్‌, సోషల్‌ మీడియాకి ఇన్ని గంటలే అన్న నియమాలు పెట్టుకోండి. నిర్లక్ష్య భావన ఉండదు.
  • పొగడ్తలు అందుకోని వారు ఎవరుంటారు చెప్పండి? కానీ మన అనుకున్న వాళ్ల నుంచి వస్తే అదిచ్చే ఆనందమే వేరు. కూర బాగున్నా, ఆయన షర్టులో అందంగా ఉన్నా చెప్పేయండి. ఇది మీ బంధంపై సానుకూల ప్రభావం చూపుతుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి.
  • ఏ బంధంలో గొడవలు, చిరుకోపాలు ఉండవు? అయితే అవి ఆ సమస్యకే పరిమితం అవ్వాలి. ‘నువ్వెప్పుడూ అంతే’, ‘పోయినసారీ అలానే చేశావు’ అంటూ పాతవి తవ్వుకుంటూ వెళ్లొద్దు. ఎప్పటికప్పుడు మరిచిపోండి. అలాకాకుండా చిట్టా పోగేసుకుంటూ వెళితే, ప్రేమ పోయి... అయిష్టం, కోపం వంటివి పేరుకుపోతాయి. చాలా చిన్నవే కదూ... కాకపోతే నిర్లక్ష్యం చేస్తుంటాం. వాటిని కాస్త పట్టించుకుంటే... అందమైన బంధం మీ సొంతం. కావాలంటే ప్రయత్నించి చూడండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్