స్లీప్‌ డివోర్స్‌ మంచిదేనా..!

భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు రావడానికి, అపార్థాలు చోటు చేసుకోవడానికి నిద్ర కూడా ఒక కారణం అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. మారిన జీవనశైలి, ఆర్థికాంశాలు... కారణాలు ఏమైనా కానీ దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్న రోజులివి.

Published : 21 Mar 2024 04:44 IST

భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు రావడానికి, అపార్థాలు చోటు చేసుకోవడానికి నిద్ర కూడా ఒక కారణం అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. మారిన జీవనశైలి, ఆర్థికాంశాలు... కారణాలు ఏమైనా కానీ దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్న రోజులివి. దీనికి మంచి నిద్ర ఉంటేనే దంపతుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయనీ, విడాకులు తీసుకునే జంటల సంఖ్యా తగ్గుతుందని ది ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ ఒక అధ్యయనం ద్వారా వివరించింది. ఇందుకు ‘స్లీప్‌ డివోర్స్‌’ పద్ధతిని పాటించమంటున్నారు..

  • భార్యాభర్తలిద్దరూ నిద్రించే వేళలు, ప్రదేశాలు, నిద్రించే తీరు ఒకేలా ఉండవట. ఇద్దరిలో ఒకరు గది వాతావరణం వెచ్చగా కోరుకుంటే, మరొకరు చల్లగా కోరుకుంటారట.
  • కొంతమందిలో గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఇది చిన్న విషయమే అనుకుంటాం కానీ, నిద్రకు భంగం కలిగిస్తుంది. దాంతో వారిలో నిరాశ, నిస్పృహలు ఆవరించి భాగస్వామిపై అరవడం, కోప్పడటం చేస్తుంటారు. వీటితో పాటు ఇద్దరికీ వేర్వేరు పనివేళలు ఉంటే మరింత ఇబ్బంది. ఇక, కొత్తగా తల్లిదండ్రులైన దంపతుల మధ్యా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిరూపితమైంది.  

దీనికోసం యూనివర్శిటీతో పాటు బెటర్‌ స్లీప్‌ కౌన్సిల్‌ నిర్వహించిన ఒక సర్వేలో ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఒంటరిగా నిద్రపోవడం వల్ల వారి మధ్య తగాదాలు తగ్గినట్లు వెల్లడైంది. మొత్తం మీద ఈ ‘స్లీప్‌ డివోర్స్‌’ను పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడంతో పాటు విడాకుల కేసులూ తగ్గాయని తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్