పోనీ ఇలా చెప్పి చూద్దామా?

‘బ్రష్‌ చెయ్‌, హోమ్‌వర్క్‌ పూర్తిచెయ్యి, చేతులు శుభ్రం చేసుకో’... ఒకటికి పదిసార్లు చెప్పినా కొన్నిసార్లు పిల్లలు మాట వినరు. ప్రతిదీ అన్నిసార్లు చెప్పాలంటే కోపం తన్నుకొచ్చేస్తుంది కదూ! అందుకే అరిచేస్తాం, అదీ దాటితే చేయి చేసుకుంటాం.

Published : 28 Mar 2024 01:51 IST

‘బ్రష్‌ చెయ్‌, హోమ్‌వర్క్‌ పూర్తిచెయ్యి, చేతులు శుభ్రం చేసుకో’... ఒకటికి పదిసార్లు చెప్పినా కొన్నిసార్లు పిల్లలు మాట వినరు. ప్రతిదీ అన్నిసార్లు చెప్పాలంటే కోపం తన్నుకొచ్చేస్తుంది కదూ! అందుకే అరిచేస్తాం, అదీ దాటితే చేయి చేసుకుంటాం. ఈ తీరు వారిలో మార్పు తీసుకురాకపోగా ఇద్దరి మధ్యా బంధాన్ని బలహీనపరుస్తుంది అంటారు నిపుణులు. అందుకే ఇలా చెప్పి చూడమంటున్నారు.

  • పని చేసుకుంటూ... దూరం నుంచి చెబుతున్నారా? అది మాని దగ్గరగా వెళ్లి చెప్పండి. ముఖ్యంగా భుజం మీద చెయ్యివేసి, వారి కళ్లలోకి చూస్తూ మృదువుగా, బలంగా చెప్పి చూడండి. దూరం నుంచి చెబుతూ ఉంటే దాన్ని వాళ్లు అంత సీరియస్‌గా తీసుకోరట. దగ్గరగా ఇలా చెబితే మ్యాజిక్‌ చేసినట్లుగా మాట వింటారట... ప్రయత్నించి చూడండి.
  • ఫలానాది చెయ్యి అనగానే ఒక్కోసారి ‘ఇది చేశాక చేస్తా’ననో... ‘ఉండమ్మా... నేనిది చూస్తున్నా’ అంటూ ఏదో చెబుతుంటారు. మనమేమో వినిపించుకోకుండా ‘ముందు వెళ్లి చెప్పింది చేయ’మని ఆజ్ఞలు జారీ చేస్తాం. ముందు వాళ్లేం చెబుతున్నారో వినండి. మనం వింటేనే వాళ్లూ మన మాట వింటారు. కాబట్టి, విసుగు, అసహనం మాని, ఓపిగ్గా వాళ్ల మాటా ఆలకించండి.
  • వాళ్లకేం తెలియదు, వాళ్ల మంచి కోసమే అని ‘ఇది చెయ్‌, అలా ఉండు’ అని చెబుతాం కదా! కానీ వాళ్లకి అవన్నీ అర్థమవవు. పైగా ప్రతిదానికీ అమ్మ కమాండ్‌ ఇస్తుంది అనే అనుకుంటారు. ఈసారి నుంచి ఏవైనా రెండు పనులు ముందుంచి, నచ్చింది చేయమనండి. ఉదాహరణకు డ్రెస్‌ మార్చుకో అనే బదులు... రెడ్‌, గ్రీన్‌ల్లో ఏది వేసుకుంటావని అడగండి. ఆసక్తీ కలుగుతుంది, ఎంచుకునే వీలు ఉండటంతో ఉత్సాహంగా చెబుతారు.
  • ఒకటి, రెండుసార్లు చెప్పి, మూడోసారి చేయకపోతే మనకి కోపం వస్తుంది. కానీ వాళ్ల చిన్ని మెదళ్లకు అన్నీ త్వరగా అర్థమవ్వవు. పదే పదే చెప్పాల్సిందే! ఇలాంటప్పుడు చాలా ఓపిక కావాలి కూడా. నెమ్మదిగా పదే పదే చెబుతూ వెళ్లండి... వారిలో మార్పు మీరే గమనిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్