అతను తగినవాడేనా?

జీవితాంతం ఒక వ్యక్తితో, అతని కుటుంబంతో కలిసి సాగడం అంత సులువేం కాదు. అందుకే ఈతరం అమ్మాయిలు ‘తగిన వాడేనా? కాదా!’ అని ఎన్నో విధాలుగా చెక్‌ చేసుకుంటున్నారు. కొందరు తమ అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు కూడా.

Published : 29 Mar 2024 02:15 IST

జీవితాంతం ఒక వ్యక్తితో, అతని కుటుంబంతో కలిసి సాగడం అంత సులువేం కాదు. అందుకే ఈతరం అమ్మాయిలు ‘తగిన వాడేనా? కాదా!’ అని ఎన్నో విధాలుగా చెక్‌ చేసుకుంటున్నారు. కొందరు తమ అనుభవాలను సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు కూడా. అలా పాపులర్‌ అయిన వాటిల్లో ‘టైనీ పోర్షన్‌’ ఒకటి. ఇంతకీ అదేంటంటే...

భోజనం చేసేప్పుడు ఆమె కొద్దిగా పెట్టుకుని, అతనికి ఎక్కువగా పెట్టేస్తుంది. అతను ఆమెను పట్టించుకోకుండా తినేస్తే అతను ఆమెకు తగినవాడు కాదన్నట్లు. అదే ‘నువ్వేంటి అంత తక్కువగా పెట్టుకున్నావ్‌’ అని అడిగితే అవతలి వ్యక్తి గురించి పట్టించుకున్నట్లు. కేవలం అడిగితే సరిపోదు. ‘ఆహారం కొద్దిగానే ఉందన్నా, ఆకలి లేదన్నా’ వినకుండా ఆమె ఎక్కువ తినేలా చూసేవారైతేనే ‘తగినవాడు’ అన్న ట్యాగ్‌ ఇచ్చేస్తున్నారు. దీనిద్వారా ఎలా తేల్చేస్తారంటారా? సాధారణంగా చాలామందిలో వండటం ఆడవాళ్ల వంతు, తినడం వరకే మావంతు అన్న అభిప్రాయం ఉంటుందట. అందుకే చాలామంది ఆడవాళ్లు తమ భాగస్వాములు ‘కనీసం తిన్నావా అనీ అడగరు’ అని వాపోతుంటారు. ఇంత చిన్న విషయాన్నే పట్టించుకోని వారు అవతలి వాళ్ల భావోద్వేగాలు, శ్రమ తదితర వాటికి ఎలా విలువిస్తారన్నది ఈ తరం అమ్మాయిల ప్రశ్న. అందుకే చేసుకోబోయే వారిపైనే కాదు, కట్టుకున్న వారిపైనా ఈ ప్రయోగం చేస్తున్నారు. మీ సంగతేంటి? ఈ ప్రయోగం మీకూ చేయాలనుందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్