పొదుపు నేర్పితే భద్రం మరి!

పిల్లలు అడిగిందల్లా కొనివ్వడంలో తప్పులేదు. కానీ, అవసరాలకు, విలాసాలకు మధ్య తేడా లేకపోయినా, ఉన్నదాంట్లో కొంత పొదుపు చేసుకోలేకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాకాకూడదంటే...

Published : 03 Apr 2024 01:49 IST

పిల్లలు అడిగిందల్లా కొనివ్వడంలో తప్పులేదు. కానీ, అవసరాలకు, విలాసాలకు మధ్య తేడా లేకపోయినా, ఉన్నదాంట్లో కొంత పొదుపు చేసుకోలేకపోయినా భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాకాకూడదంటే...

  • చిన్నప్పుడు మనం ఎవరింటికి వెళ్లినా, మన ఇంటికి బంధువులొచ్చినా చేతిలో కొంత డబ్బులు పెట్టి బిస్కెట్లో, చాక్లెట్లో కొనుక్కోమనేవారు కదా! కానీ, వాటిని మనం ఎంచక్కా మన కిడ్డీ బ్యాంకులో దాచుకునేవాళ్లం. తరవాతెప్పుడో అది నిండాక కోరిన వస్తువుని కొనుక్కునేవాళ్లం. మరి ఇప్పుడు ఈ అలవాటుని మీ చిన్నారికి చేశారా? లేదంటే ఇప్పుడైనా ఆ పని చేయండి. అలాగని వారికి నచ్చింది కొనుక్కోవద్దని కాదు... వాళ్లదగ్గర 100 రూపాయలే ఉన్నా... దాన్లో పదిహేను శాతం పొదుపు చేయాలనే నియమం పెట్టండి. క్రమంగా పొదుపు చేయడానికి అలవాటు పడతారు. చిన్న చిన్న లక్ష్యాలకోసం దాచుకోవడం ఎలానో చూపించండి. ప్రోత్సహించేందుకు వారు మెచ్చే డిజైన్‌లో ఓ కిడ్డీబ్యాంక్‌ కొనివ్వండి.
  • డబ్బు- పొదుపు విషయంలో మీ ఇంటి అలవాట్లనూ సరిచూసుకోండి. ఖర్చు, దుబారా జరుగుతున్న విషయాల్లో ఆచితూచి అడుగులేయండి.  నెల ప్రారంభంలో ఆర్భాటాలకు పోయి ఉన్న డబ్బంతా ఖర్చుచేసి నెల చివర్లో దంపతులిద్దరూ కీచులాడుకోవద్దు. ఈ అలవాటు పసిపిల్లలపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ప్రతి ఖర్చుకీ లెక్కరాయడం, లోటు వచ్చినప్పుడు సర్దుకుపోవడం, ఖర్చుల్లో కోత విధించడం వంటివీ చూపించండి. ఇవన్నీ వారిలో ఆర్థిక క్రమశిక్షణ అలవరుస్తాయి.
  • పిల్లలకు డబ్బులిచ్చి వదిలేయడం కాదు...వారు సరిగానే ఖర్చుపెడుతున్నారో లేదో గమనించండి. ఎప్పుడైనా పక్కదారి పడుతుంటే అదెంత ప్రమాదమో  ఉదాహరణతో వివరించండి. ఉన్న డబ్బులతోనే సంతోషంగా ఎలా ఉండొచ్చో వారికి తెలిసేలా చేయండి. సినిమా ఖర్చు తగ్గించుకునేందుకు వారాంతాల్లో బీచ్‌కో, పార్కుకో తీసుకెళ్లండి. ఇవన్నీ వారిలో కొత్త ఆలోచనలకు దారితీస్తాయి. ఆర్థిక భద్రతను అందిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్