దాంపత్యంలోకి అడుగుపెడుతున్నారా..!

కొత్తగా పెళ్లై నూతన జీవితంలోకి అడుగుపెట్టే వారు... దాంపత్యం అన్యోన్యంగా సాగాలంటే ఈ కింది అంశాలను అనుసరించి మసలుకోవాలంటున్నారు నిపుణులు... మరి అవేంటో మీకూ తెలుసుకోవాలనుందా..!

Published : 13 Apr 2024 01:52 IST

కొత్తగా పెళ్లై నూతన జీవితంలోకి అడుగుపెట్టే వారు... దాంపత్యం అన్యోన్యంగా సాగాలంటే ఈ కింది అంశాలను అనుసరించి మసలుకోవాలంటున్నారు నిపుణులు... మరి అవేంటో మీకూ తెలుసుకోవాలనుందా..!

  • పెళ్లికి ముందు దాంపత్య జీవితం గురించి ఎన్నో కలలు కంటుంటాం.. కానీ నిపుణులు మాత్రం నూతన వధూవరులను వాస్తవానికి దగ్గరగా ఆలోచించడం అలవరుచుకోమంటున్నారు. భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కంటే మానసికంగా దగ్గర అవ్వాలంటున్నారు. ఇదే వివాహబంధంలో చాలావరకు సమస్యలను దూరం చేస్తుంది.
  • నిదానమే ప్రధానం... తక్కువ సమయంలో ఎక్కువ తెలుసుకోవాలనే తత్త్వం దాంపత్యంలో మంచిది కాదు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలి. ఇలా చేయడంవల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత పెరుగుతుంది. అంతేకాదు అపార్థాలకు తావుండదు.
  • పెళ్లైన కొత్తలో ఉండే ప్రేమ రోజులు గడుస్తున్న కొద్దీ తగ్గుతుందట. దానికి కారణం ఎడతెరిపి పనులతో తీరిక లేకపోవడం కూడా. ఇది ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచగలదు. అలా కాకూడదంటే మీకోసం మీరు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. వారంలో ఒకరోజు ఎన్ని పనులున్నా భాగస్వామిని సినిమాకో, రెస్టరంట్‌కో తీసుకెళ్లండి. కలిసి వ్యాయామం చేయడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, తోటపని చేయడం వంటివీ ఇద్దరినీ దగ్గర చేసేవే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్