గర్భస్రావం అయ్యాక..!

వయసు 27. ప్రైవేట్‌ ఉద్యోగినిని. గర్భం దాల్చిన రెండు నెలలకే గర్భస్రావం అయ్యింది. అప్పటి నుంచి కాసేపు పనిచేసినా నిస్సత్తువగా అనిపిస్తోంది. బలం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Updated : 18 Apr 2024 16:56 IST

వయసు 27. ప్రైవేట్‌ ఉద్యోగినిని. గర్భం దాల్చిన రెండు నెలలకే గర్భస్రావం అయ్యింది. అప్పటి నుంచి కాసేపు పనిచేసినా నిస్సత్తువగా అనిపిస్తోంది. బలం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

 రవళి, మండపేట

ర్భధారణ సమయంలో హార్మోనుల్లో అనేక మార్పులు వస్తాయి. అలాంటిది మీకు గర్భస్రావమైంది. కాబట్టి, శరీరం కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పోషకాహార లోపం కూడా గర్భస్రావానికి కారణం అవుతుంది. పైగా మీరు కొద్దిసేపు పనిచేసినా అలసిపోతున్నా అని చెప్పారు. కాబట్టి, హిమోగ్లోబిన్‌, బ్లడ్‌షుగర్‌, మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో పరీక్షలు చేయించుకోవాలి. కొంతమందికి గర్భం దాల్చిన తరవాత బ్లడ్‌ షుగర్‌ వచ్చే అవకాశాలున్నాయి. అదీ కారణం కావొచ్చు. ముందు శక్తి పుంజుకోవడానికి... ఒకపూట జొన్న, గోధుమలతో చేసిన ఆహారాన్ని కానీ, దంపుడు బియ్యాన్ని కానీ తీసుకోండి. రోజూ క్రమం తప్పకుండా పాలు, పెరుగు, రెండు గుడ్లు, లేదా 100గ్రా. చికెన్‌, నారింజ, బత్తాయి, ఉసిరి, జామ వంటి పండ్లు తీసుకోవాలి. అదే శాకాహారులైతే 40గ్రా. సోయానగ్గెట్స్‌ లేదా 90గ్రా. పప్పుదినుసులు, 300గ్రా. కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవాలి. రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. వీటితోపాటూ నిమ్మరసం కలిపిన నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలనూ తీసుకోవాలి. తీపిపదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి... సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్