అపరాధ భావం లేకుండా...

పసిపాపను వదిలేసి విధులకు వెళ్లాలంటే ఏ తల్లికి మనసొప్పుతుంది?  ఇంట్లో వాళ్లని చూసుకునేందుకు ఎవరూ లేకపోతే ఆ ఇబ్బంది వర్ణనాతీతం. అలాగని కేర్‌టేకర్‌ని నియమించుకున్నా ఎన్నో భయాలు. మరేం చేయాలి? మీకోసమే ఈ చిట్కాలు.

Published : 19 Apr 2024 01:56 IST

పసిపాపను వదిలేసి విధులకు వెళ్లాలంటే ఏ తల్లికి మనసొప్పుతుంది?  ఇంట్లో వాళ్లని చూసుకునేందుకు ఎవరూ లేకపోతే ఆ ఇబ్బంది వర్ణనాతీతం. అలాగని కేర్‌టేకర్‌ని నియమించుకున్నా ఎన్నో భయాలు. మరేం చేయాలి? మీకోసమే ఈ చిట్కాలు.

  • పాప అన్నం సరిగా తిందో లేదో నిద్రపోతుందో, ఆడుకుంటుందో... అంటూ బోలెడు సందేహాలు, అనుమానాలు వస్తుంటాయి. దీనికి బెంగ ఎందుకు? ఇంట్లో రెండు హిడెన్‌ కెమెరాలు, రెండు సీసీ కెమెరాలను బిగించుకోండి. ఒకవేళ డేకేర్‌ సెంటర్‌లో వదిలి వెళ్లినా... అక్కడా ఆ సౌకర్యం ఉందో లేదో చూసి చేర్చండి. వాటిని మీ ఫోన్‌కి అనుసంధానించుకుంటే సరి. భరోసాగా ఉంటుంది.
  • పిల్లలు లేవకముందే గడపదాటి, వాళ్లు నిద్రపోయాక ఇంటికి చేరుకుంటున్నారా? దాంతో పిల్లల్లో అభద్రత చేరుతుంది. వాళ్లతో గడిపే సమయం లేక మీకూ బెంగగా ఉంటుంది. సెలవు రోజులే కాబట్టి... వారిని ముందే నిద్రలేపండి. మీతో పాటు ఉదయపు నడకకు తీసుకెళ్లండి. రోజంతా ఎలా గడిచిందో? తన అవసరాలు, అభిప్రాయాలూ...అడిగి తెలుసుకోండి.
  • భార్యాభర్తలు ఇద్దరూ తప్పక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటే పిల్లల్ని వదిలేసి వెళ్లాల్సి వస్తోందన్న అపరాధభావం అక్కర్లేదు. ఇద్దరూ షిఫ్ట్‌లను సర్దుబాటు చేసుకోండి. ఒకరు ఆఫీసుకెళ్లే సమయానికి మరొకరు ఇంటికి చేరుకునేలా చూసుకుంటే సరి. మీ సమస్యా తీరుతుంది.
  • వేసవి సెలవుల్లోనూ పిల్లల్ని ఇంట్లోనే వదిలి ఆఫీసుకెళ్లాల్సి వస్తోందా? ఇలాంటప్పుడు స్నేహితులు, సరదాలు లేకపోతే వారు మరింత ఇబ్బందిగా ఫీలవుతారు. వీలైతే ఏ హాబీ క్లాసుల్లోనో చేర్చండి. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకునేలా చేయండి. అప్పుడు మీకు కాస్త బెంగ తగ్గుతుంది.
  • అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడూ, ఇతరత్రా అవసరాలు ఏర్పడినప్పుడు... ఆఫీసు నుంచి తక్కువ సమయంలోనే వారిని చేరుకునేంత దగ్గరలో ఇల్లు తీసుకోండి. ఇరుగు పొరుగుతో, స్నేహితులతో సాన్నిహిత్యం ఉన్నప్పుడు కాస్త భద్రంగానూ ఉండొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్