నైపుణ్యాలకు సానపెట్టండిలా..

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలంతా అల్లరే అల్లరి. ఆట, పాటలతో ఇల్లంతా సందడిగా మార్చేస్తారు. ఆ వినోదానికి విజ్ఞానాన్నీ జోడించాలంటున్నారు నిపుణులు. ఈ సెలవుల్లో వారికి కొన్ని పాఠాలు నేర్పిద్దామిలా.. ఈ రోజుల్లో స్వీయ రక్షణ చాలా ముఖ్యం. ఆడపిల్లలకైతే మరీనూ. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఘటనలు ఎదురవుతాయో తెలీక స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా గుమ్మం బయట కాపలా ఉండాల్సి వస్తోంది.

Updated : 22 Apr 2024 18:53 IST

వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. పిల్లలంతా అల్లరే అల్లరి. ఆట, పాటలతో ఇల్లంతా సందడిగా మార్చేస్తారు. ఆ వినోదానికి విజ్ఞానాన్నీ జోడించాలంటున్నారు నిపుణులు. ఈ సెలవుల్లో వారికి కొన్ని పాఠాలు నేర్పిద్దామిలా..

రోజుల్లో స్వీయ రక్షణ చాలా ముఖ్యం. ఆడపిల్లలకైతే మరీనూ. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ఘటనలు ఎదురవుతాయో తెలీక స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా గుమ్మం బయట కాపలా ఉండాల్సి వస్తోంది. తమని తాము రక్షించుకునే విధంగా పిల్లల్ని ఇప్పటి నుంచే తీర్చిదిద్దాలి. మంచి, చెడులకు వ్యత్యాసాన్ని చెబుతూ శారీరకంగా, మానసికంగా వాళ్ళని శక్తిమంతంగా చేసే మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాసుల్లో చేర్చాలి.

  • పోటీ ప్రపంచంలో తమని తాము నిరూపించుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి వస్తోంది. అందుకే మీ పిల్లలకు మక్కువ ఉన్న రంగాల్లో రాణించే విధంగా అవసరమైన నైపుణ్యాలను అందించేలా ప్రయత్నించండి.
  • సెలవుల్లో కూడా తరగతులు, చదువు అంటే పిల్లలకు బోర్‌ కొట్టేస్తుంది. అలా కాకుండా మీరేం నేర్పించాలనుకున్నా ఒక టాస్క్‌లా ఇచ్చి అది పూర్తైన వెంటనే వారిని ఆడుకోవడానికి వదిలేయండి. తమకు ఇచ్చిన పనిని పూర్తిచేసిన వారికి బహుమతులు ఇవ్వండి. వారిలో నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది.
  • సమ్మర్‌ క్యాంపులకు పంపే ఏర్పాట్లు చేయండి. దీనివల్ల కొత్తవారిని కలవడం, మాట్లాడటం, మసలుకోవడం వంటివి నేర్చుకుంటారు. తెలియని వాళ్లతో పిల్లల్ని ఎలా పంపుతాం అని భయపడితే అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గరకు పంపండి.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్