ఆపొద్దు.. ఎగరనిద్దాం!

‘ఆ పిల్లలు చూడు ఎంత బుద్ధిగా ఉన్నారో! నీ అల్లరితో నా తలప్రాణం తోకకి వస్తోంది..’ ఎప్పుడైనా మీరు పిల్లలతో ఇలా అన్నారా?

Updated : 08 May 2024 15:08 IST

‘ఆ పిల్లలు చూడు ఎంత బుద్ధిగా ఉన్నారో! నీ అల్లరితో నా తలప్రాణం తోకకి వస్తోంది..’ ఎప్పుడైనా మీరు పిల్లలతో ఇలా అన్నారా? ఈ కథను వింటే ఎప్పటికీ అలా అనరు. రుబియో తన కొడుకు అలెక్స్‌ని తీసుకుని బయట ఆడుతూ ఉంటాడు. ఏడాది వయసున్న అలెక్స్‌ ఉన్నట్టుండి గాల్లో స్వేచ్ఛగా, ఇష్టంగా ఎగరడం మొదలుపెడతాడు. అలా ఎగరడం ఆ తండ్రికి నచ్చినా, ‘అందరూ చూసి ఏమనుకుంటారు? వీడేదో తేడా అనుకోరూ!’ అన్న భయంతో ఆ పిల్లాడిని ఇంట్లోనే ఉంచేస్తాడు. అలెక్స్‌కి నాలుగేళ్లు వచ్చినా ఎగరడం మాత్రం ఆపడు. ఇలా కాదని తండ్రి వాడికో బరువైన పుస్తకాల బ్యాగుని ఇచ్చి ఎగరనీయకుండా చేస్తాడు. అయినా సరే ఆ పిల్లాడు ఎగురుతూనే ఉంటాడు. కోపంతో ఆ పిల్లాడి వీపుమీద నాలుగిచ్చిన తరవాత కానీ వాడు  మౌనంగా ఉండడు. రుబియో అనుకున్నట్టుగా వాడిని కట్టడి చేశాడు కానీ అది అతని మనసుకీ నచ్చలేదు. కొడుకుని పట్టి ఆపుతున్న బరువుని దించేసి అతన్ని పూర్వంలా ఎగరనిస్తాడు. కథ అంతే! కేవలం ఆరంటే ఆరు నిమిషాల నిడివితో ‘పిక్సర్‌’ సంస్థ నిర్మించిన ఈ ‘ఫ్లోట్‌’ అనే యానిమేషన్‌ సినిమా పేరెంటింగ్‌ని చిటికెలో అర్థమయ్యేలా చెబుతుంది. కాస్త అల్లరిగా లేదా ఆటిజంతో బాధపడే పిల్లలని కట్టిపడేయాలని వాళ్లకి ఇష్టంలేని అనేక బరువులని వేలాడదీస్తాం మనమంతా! అవన్నీ పిల్లల్ని ఎలా బాధపెడతాయో చెప్పే చిట్టి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది చూసిన ఈ చిత్రానికి మూలం... రుబియో, అలెక్స్‌లే. ఇవి వాస్తవ పాత్రలు. ఆటిజం సమస్య ఉన్న బిడ్డతో ఎలా మెలగాలో తెలియక రుబియో భార్య మొదట్లో ఇబ్బంది పడింది. తరవాత సర్దుకుంది. ఈ విషయాన్నే ఆమె అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. యానిమేటర్‌ అయిన భర్త రుబియో సాయంతో కలిసి ఫ్లోట్‌ని రూపొందించారు. సమస్య వాళ్లదే అయినా పరిష్కారం మనందరికీ దొరికింది కదూ! ఈ సమ్మర్‌లో పిల్లలతో కలిసి మీరూ ఈ సినిమా చూడండి.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్