ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..!

అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను డిగ్రీ చదివిస్తోంది. నాన్న జీతం ఆయన దురలవాట్లకే సరిపోతుంది. నాన్న వల్ల అమ్మ ఎప్పుడూ సంతోషంగా లేదు. అందుకే ఆఫీసులో తన సహచరునితో రిలేషన్‌లో ఉన్నట్లు ఈమధ్యే నాకు తెలిసింది.

Published : 13 May 2024 13:08 IST

అమ్మ ఉద్యోగం చేస్తూ నన్ను డిగ్రీ చదివిస్తోంది. నాన్న జీతం ఆయన దురలవాట్లకే సరిపోతుంది. నాన్న వల్ల అమ్మ ఎప్పుడూ సంతోషంగా లేదు. అందుకే ఆఫీసులో తన సహచరునితో రిలేషన్‌లో ఉన్నట్లు ఈమధ్యే నాకు తెలిసింది. చదువుతున్నా కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి. అమ్మ నాకోసం ఎన్నో కష్టాలు పడింది. అయినా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏం చేయాలో తెలియట్లేదు.

ఓ సోదరి

మన కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులిద్దరికీ పిల్లల సంరక్షణపై బాధ్యత ఉంటుంది. ఆత్మవిశ్వాసం, జాలి, దయ లాంటి గుణాలు పిల్లల్లో అమ్మానాన్నల నుంచే అలవడతాయి. మీ నాన్న బాధ్యతారాహిత్యంతో ఉండడం, కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల మీ అమ్మ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు. అందుకే తన కొలీగ్‌తో స్నేహబంధం కొనసాగిస్తుండొచ్చు. అయితే, అది ఎటువంటి రిలేషన్‌షిప్‌ అన్నది మనం చెప్పలేము. ఇద్దరి మధ్యలో సంబంధం శారీరకంగానే ఉండక్కరలేదు. ఎమోషనల్‌గానూ ఆమె ఆ వ్యక్తి ద్వారా ధైర్యాన్ని పొందుతుండొచ్చు. ఏది ఏమైనా మీకు పూర్తిగా విషయం తెలియనప్పుడు వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందని ఊహించుకుని అపార్థం చేసుకోవడం, బాధపడటం మంచిది కాదు. దానివల్ల మీ భవిష్యత్తు పాడవుతుంది. ముందు మీరు బాధపడుతున్న విషయం గురించి మీ అమ్మను సున్నితంగా అడగండి. ఆవిడే మీకు విశదీకరిస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అలాంటి ఆలోచన ఉండి ఉంటే ఆవిడ కూడా ఆలోచించుకుంటారు. మీకూ భారం తగ్గుతుంది. అంతకంటే ముందు మీ అమ్మానాన్నలు కౌన్సెలింగ్‌కు వెళ్లేలా చూడండి. వారిమధ్య బంధం బాగుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్