ఆడేద్దామా.. ఏడు పెంకులాట!

రెండు జట్లు.. ఏడు రాళ్లు లేదా పెంకులు.. ఒక టెన్నిస్‌ బంతి.. ఆ రాళ్లను ఒకదానిపై ఒకటి టవర్‌లా పేర్చి ఒక జట్టు దాన్ని పడగొట్టి మళ్లీ కడుతూ ఉంటే ప్రత్యర్థి జట్టు ఈ రాళ్లను చెదరగొడుతూ ఉండాలి.

Published : 15 May 2024 01:42 IST

రెండు జట్లు.. ఏడు రాళ్లు లేదా పెంకులు.. ఒక టెన్నిస్‌ బంతి.. ఆ రాళ్లను ఒకదానిపై ఒకటి టవర్‌లా పేర్చి ఒక జట్టు దాన్ని పడగొట్టి మళ్లీ కడుతూ ఉంటే ప్రత్యర్థి జట్టు ఈ రాళ్లను చెదరగొడుతూ ఉండాలి. ఆడటానికి ఓపిక ఉండాలే గానీ వయసుతో సంబంధం లేదు.. ఆడేవాళ్లంతా చురుకుగా అలర్ట్‌గా ఉంటూ ఆ రాళ్లను పేరుస్తూ ఉంటే వేరే వాళ్లు చెదరగొడుతూ ఉంటారు. దీన్నే లగోరీ అనీ, ఏడు రాళ్లాట అనీ పిలుస్తారు. సరదాగా ఆరుబయట ఆడే ఈ లగోరీకి దేశవిదేశాల్లో కూడా మంచి క్రేజ్‌ ఉందని తెలుసా! అంతేనా.. దీనికి జాతీయ స్థాయిలో ఛాంపియన్స్‌ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్లు జరుగుతాయి. దీనికి ప్రపంచ కప్‌ కూడా ఉంది. చాలా చోట్ల ఈ ఏడురాళ్లాటని విద్యాసంస్థల్లో కూడా భాగం చేశారట. ఇంత చరిత్ర ఉన్న ఈ లగోరీ ద్వాపరయుగం నుంచే ఉందట.

శ్రీకృష్ణుడు తన స్నేహితులతో ఎక్కువగా ఈ ఏడు పెంకులాటే ఆడేవాడట. దాన్ని రిఫరెన్స్‌గా తీసుకునే ఈ లగోరీని రూపొందించారట. గోవాలో జాతీయ క్రీడలకి ఒక ఆటని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి క్రీడల మంత్రి ఈ లగోరీని ఎంపిక చేశాడట. ఆ తర్వాత దీని గురించి ప్రధానమంత్రి మోదీ కూడా మన్‌కీబాత్‌లో ప్రస్తావించి తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఇంతటి చరిత్ర గల ఈ ఏడు రాళ్లాట మన భారత సంతతికి చెందినది అని తలుచుకుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ లగోరీని పిల్లలకి నేర్పించండి. ఈ వేసవి సాయంత్రాల్లో మీరూ వాళ్లతో కలిసి ఆడేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్