బుజ్జాయిలకూ జలకాలాట!

అడపాదడపా వర్షాలు పడినా... ఆ చల్లదనం కొద్దిసేపే కదూ! పగలు వేడి, దానికితోడు ఉక్కబోత. ఈ చిరాకుకి ఎన్నిసార్లు స్నానం చేసినా తక్కువే అనిపిస్తుంది. అయితే ఈ ఇబ్బంది మనకే కాదు పసివాళ్లకీ ఉంటుంది. అందుకే వాళ్లనీ నీటిలో కాసేపు ఆడుకోనివ్వండి. దీనివల్ల బోలెడు అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. చక్కగా నిద్రపడుతుంది, చర్మం మృదువుగా అవుతుందని రోజూ వేడినీటి స్నానాలు, నలుగు పెట్టడం వంటివి చేయొద్దు.

Published : 29 May 2024 03:56 IST

అడపాదడపా వర్షాలు పడినా... ఆ చల్లదనం కొద్దిసేపే కదూ! పగలు వేడి, దానికితోడు ఉక్కబోత. ఈ చిరాకుకి ఎన్నిసార్లు స్నానం చేసినా తక్కువే అనిపిస్తుంది. అయితే ఈ ఇబ్బంది మనకే కాదు పసివాళ్లకీ ఉంటుంది. అందుకే వాళ్లనీ నీటిలో కాసేపు ఆడుకోనివ్వండి. దీనివల్ల బోలెడు అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి.

క్కగా నిద్రపడుతుంది, చర్మం మృదువుగా అవుతుందని రోజూ వేడినీటి స్నానాలు, నలుగు పెట్టడం వంటివి చేయొద్దు. అసలే సున్నితమైన చర్మం. ఎరుపెక్కడం, అలర్జీలకు దారితీస్తాయి. నూనె మర్దనా, గోరువెచ్చని నీటితో స్నానం చాలు. అలాగని సబ్బునీ అతిగా వాడొద్దు. ఒకపూట దాంతో చేయించినా... మరోపూట కేవలం నీటిని పోస్తూ చేత్తో రుద్ది కడిగితే సరిపోతుంది అంటారు నిపుణులు.

  • ఒక టబ్బుని గోరువెచ్చని నీటితో నింపి, అరకప్పు పాలు పోయండి. ఆ నీటిలో చిన్నారులను కూర్చోబెట్టి, ఆడుకోనిస్తే సరి. వాళ్లకీ హాయిగా ఉంటుంది, చర్మానికీ కావాల్సిన తేమ అందుతుంది. తేనె, కాస్త వినెగర్‌ కలిపినా మంచిదే. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు దద్దుర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చివర్లో గోరువెచ్చని నీటితో మరోసారి ఒళ్లంతా కడిగితే చాలు.
  • టబ్బులో గోరువెచ్చని నీటిని పోసి, కొన్ని బొమ్మలు వేసి, కూర్చోబెట్టండి. నీటిని కొడుతూ, బొమ్మలతో ఆడుతూ ఉంటారు కదా! దీనివల్ల వారిలో మోటార్‌ స్కిల్స్‌ అభివృద్ధి చెందుతాయట. కంటికీ, చేతికీ మధ్య సమన్వయం కూడా ఏర్పడుతుంది. అంతేకాదు, నీటితో ఆట వాళ్లల్లో విశ్రాంతి భావననీ కలిగిస్తుంది. దీన్ని కేవలం ఆటగానే భావించొద్దు. ఇది వారికి ఏకాగ్రతను పెంచే సాధనం కూడా. అందుకే జలకాలాటను చిన్నారి రోజువారీ ప్రక్రియలో తప్పక భాగం చేయమంటారు నిపుణులు. అయితే... నెలల నుంచి ఆరేళ్ల వయసు వరకు పిల్లలు నీటితో ఆడుతోంటే ఎవరో ఒకరు పెద్దవాళ్లు పక్కనే ఉండటం తప్పనిసరి. అప్పుడే ఎలాంటి ప్రమాదాలకూ తావుండదు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్