భార్య పుట్టినరోజు మర్చిపోతే...జైలుకే!

పుట్టినరోజుకు భర్త ప్రేమతో ఇచ్చే చిరు కానుక కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది కదా! ఏమీ ఇవ్వకున్నా ఆ రోజును గుర్తుంచుకుని శుభాకాంక్షలు చెప్పినా చాలనుకునే అల్ప సంతోషులం మనం.

Published : 08 Jun 2024 03:24 IST

ఇది విన్నారా?!

పుట్టినరోజుకు భర్త ప్రేమతో ఇచ్చే చిరు కానుక కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది కదా! ఏమీ ఇవ్వకున్నా ఆ రోజును గుర్తుంచుకుని శుభాకాంక్షలు చెప్పినా చాలనుకునే అల్ప సంతోషులం మనం. కానీ, మగవాళ్లు మాత్రం గుర్తులేదు... పనిలో పడి మర్చిపోయా...అంటూ రకరకాల కారణాలు చెప్పేస్తుంటారు. మనమూ దాన్ని మర్చిపోయి... సర్దుకుపోతుంటాం. అయితే, ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోని దేశం ఒకటి ఉందని మీకు తెలుసా? ఇక్కడ భార్య పుట్టినరోజును మర్చిపోతే ఇక వాళ్ల పని అంతే. ‘సమోవా’ అనే దేశంలో దీన్ని నేరంగా భావిస్తారట. అమెరికా సమీపంలో ఉండే పాలీనేసియన్‌ ఐల్యాండ్‌ దేశం ఇది. అందుకోసం ఇక్కడి ప్రభుత్వం ఏకంగా ఓ చట్టమే చేసింది. పైగా ఈ చట్టం సరిగా అమలవుతుందా? లేదా అనేది చూడడానికి ప్రత్యేకంగా పోలీసు బృందాలను కూడా ఏర్పాటుచేశారట.  భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోతే పోలీసులు భర్తకు వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తారట. అదే పొరపాటు రెండోసారీ చేస్తే వాళ్లకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేళ్లపాటు జైలు శిక్ష కూడా వేస్తారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తారు. అంతేకాదు, భార్యకు తన హక్కుల గురించి, ఈ చట్టం గురించి అవగాహన కల్పించడానికి దేశమంతా క్యాంపులనూ నిర్వహిస్తారట.  ఏదిఏమైనా ఇలాంటి చట్టం మనదేశంలో కనుక ఉండి ఉంటే జైళ్లన్నీ నిండిపోతాయేమో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్