తిరుపతి బొమ్మలతో... భళా!

న్యాయవాది కావాలనే కోరికతో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యలో చేరిన పవిత్ర మరోవైపు తన అభిరుచికీ పదును పెడుతోంది. పురాణ, ఇతిహాస ఘట్టాలను అందమైన బొమ్మలుగా గీసి అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. మొదట్లో స్నేహితుల సలహా మేరకు పవిత్రా ఆర్ట్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో తన బొమ్మలని పోస్ట్‌ చేసేది...

Published : 25 Jun 2022 00:27 IST

భవిష్యత్‌ తరాలకి మన సంస్కృతి గొప్పతనం తెలిసేలా చేయడానికి బొమ్మలతో వినూత్నమైన ప్రయోగం చేస్తోంది తిరుపతికి చెందిన పవిత్ర...

న్యాయవాది కావాలనే కోరికతో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యలో చేరిన పవిత్ర మరోవైపు తన అభిరుచికీ పదును పెడుతోంది. పురాణ, ఇతిహాస ఘట్టాలను అందమైన బొమ్మలుగా గీసి అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. మొదట్లో స్నేహితుల సలహా మేరకు పవిత్రా ఆర్ట్స్‌ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో తన బొమ్మలని పోస్ట్‌ చేసేది. వాటికి మంచి పేరు రావడంతో యునైటెడ్‌ ఒరిజినల్స్‌ అనే యూట్యూబ్‌ సంస్థ ఆమెకో బాధ్యతను అప్పగించింది. తిరుమల శ్రీవారి ఆలయం మొదలు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు తెలియని ఎన్నో ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక అంశాలను బొమ్మలుగా వేయమని కోరింది. దాంతో అప్పటి పరిస్థితులు, ఆచార వ్యవహారాల గురించి పుస్తకాల్లో చదువుతూ, పెద్దలను అడిగి తెలుసుకుంటూ వాటికి వర్ణచిత్ర రూపం ఇస్తోంది. ఇప్పటికే ఆమె వేసిన వందల చిత్రాలతో రూపొందిన 700 సంవత్సరాల చరిత్ర ఉన్న గోవిందరాజస్వామి ఆలయ పురాణం, తిరుమల ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ తదితర వీడియోలు యూట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. న్యాయవాద వృత్తితోపాటు చిత్రలేఖనాన్నీ కొనసాగిస్తూ తన కళతో మన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందిస్తానంటోంది పవిత్ర.

- మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్