అంతరిక్షంలో అతివలు..

ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి నేటివరకు 75 మంది మహిళా వ్యోమగాములు అడుగుపెట్టారు. మొత్తం వ్యోమగాముల్లో ఇది 12 శాతం. వీరిలో కొందరు స్పేస్‌వాక్‌ చేయగా.. ఇంకొందరు పలు ప్రతిష్ఠాత్మకమైన పరిశోధక ప్రాజెక్టుల్లో భాగమయ్యారు.

Published : 10 Oct 2022 00:30 IST

అక్టోబరు 4 - 10 అంతరిక్ష వారోత్సవం

ఆకాశాన్నీ దాటి అంతరిక్షంలోకి నేటివరకు 75 మంది మహిళా వ్యోమగాములు అడుగుపెట్టారు. మొత్తం వ్యోమగాముల్లో ఇది 12 శాతం. వీరిలో కొందరు స్పేస్‌వాక్‌ చేయగా.. ఇంకొందరు పలు ప్రతిష్ఠాత్మకమైన పరిశోధక ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. వందల రోజులు అంతరిక్ష కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి తమ మాతృదేశాలకు గర్వకారణమయ్యారు.

అంతరిక్షయాత్ర చేసిన మహిళల్లో అమెరికాకు చెందినవారే అత్యధికం. తర్వాత స్థానం రష్యాది. ఆ దేశం నుంచి అయిదుగురు వెళ్లగా, చైనా, కెనడా, జపాన్‌ నుంచి ఇద్దరిద్దరు.. ఫ్రాన్స్‌, ఇటలీ, దక్షిణ కొరియా, యుకె నుంచి ఒక్కొక్కరున్నారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌, శిరీష బండ్ల.. అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మహిళలు.

పరిశోధనలు.. ప్రయోగాలు..
అంతర్జాతీయ అంతరిక్షకేంద్రంలో పలు ప్రయోగాలు చేపట్టి తమ ప్రత్యేకతను చాటిన మహిళలూ కొందరున్నారు. వారిలో కెలా బరాన్‌ ఒకరు. ఈమె పత్తి కణజాలాల నుంచి మొక్కల్ని పెంచి చూపిస్తే, నాసా వ్యోమగామి మెగాన్‌ మెక్‌ ఆర్థర్‌ గుండె కండరాల పనితీరు, తగిన చికిత్స వంటివాటిపై పలు ప్రయోగాలు చేసింది. జెస్సికా మెయిర్‌ అంతరిక్షంలో తాజా ఆహారాన్ని తయారుచేసుకోవడం, ఆకుకూరలను పెంచడంలో కాంతి, ఎరువుల ప్రభావంపై ప్రయోగాలు చేపట్టి నిరూపించింది. ఇలా మరెందరో తమ ప్రయోగాలతో కొత్త మార్గాలు చూపించారు.

అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసిన మొదటి మహిళగా స్వెత్లానా సవిత్స్‌కయా కాగా, అత్యధికంగా   8.56 గంటలు స్పేస్‌వాక్‌ చేసిన మహిళ సూసన్‌ హెల్మ్‌. తొలి మహిళా ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ 2008లో ఆరు నెలలపాటు విధులు నిర్వహించింది. 2010లో నలుగురు మహిళా వ్యోమగాములు ఒకేసారి అంతరిక్షయాత్రలో పాల్గొని చరిత్ర సృష్టించారు. స్పేస్‌స్టేషన్‌ నుంచి లైవ్‌లో పాల్గొన్న తొలి మహిళ అన్నెమెక్‌లైన్‌, స్పేస్‌వాక్‌ను పూర్తిచేసిన తొలి మహిళా బృంద సభ్యులు జెస్సికా మెయిర్‌, క్రిస్టినా కోచ్‌.. ఇలాంటి వారెందరో రేపటితరానికి స్ఫూర్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్