ఇందులో రహస్యం ఏముంది?

నాకు మొదటిసారి పీరియెడ్స్‌ వచ్చినప్పుడు అమ్మా వాళ్లు చెప్పినమాట.. ‘దీన్ని రహస్యంగానే ఉంచు. ఎవ్వరికీ చెప్పకు’ అని. తర్వాత ‘గుడికి వెళ్లొద్దు.. వంట గదిలోకి రావొద్దు.

Updated : 19 Oct 2022 05:14 IST

నాకు మొదటిసారి పీరియెడ్స్‌ వచ్చినప్పుడు అమ్మా వాళ్లు చెప్పినమాట.. ‘దీన్ని రహస్యంగానే ఉంచు. ఎవ్వరికీ చెప్పకు’ అని. తర్వాత ‘గుడికి వెళ్లొద్దు.. వంట గదిలోకి రావొద్దు. పదార్థాలు తాకొద్దు’... ఇలా ఆంక్షలు పెరుగుతూ వచ్చాయి. కొన్ని రోజులకి నెలసరి అంటేనే ఓ అపరాధభావం మొదలయ్యింది. వయసొచ్చాక పరిశోధిస్తే ఆసియాలో ఉన్న కోట్లమంది ఆడపిల్లలదీ ఇదే పరిస్థితి అని తెలిసింది. పరిష్కారం కోసం ఆలోచించా. ‘ఎవరితోనూ మాట్లాడకూడదు’ అనుకుంటున్న విషయం గురించే అమ్మాయిలు బహిరంగంగా, భయం లేకుండా చర్చించుకునేలా చేయాలనుకున్నా. ఆ లక్ష్యంతోనే మెనుస్ట్రుపీడియా సంస్థను స్థాపించా. తొమ్మిదేళ్ల కంటే ముందే ఆడపిల్లలు వాళ్ల శరీరం గురించి తెలుసుకొనేందుకు వీలుగా నెలసరి పాఠాలని రంగుల బొమ్మలతో కామిక్‌ పుస్తకాలుగా ప్రచురించా. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదువుకున్న అనుభవం నాకు స్ఫూర్తినిచ్చింది. మొదట్లో నీది వృథా ప్రయత్నం అన్నవాళ్లంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. కారణం... మా కామిక్‌ పుస్తకాలని ప్రభుత్వ బడుల్లో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. 11 భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రభుత్వాలూ వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. మన దేశంలో ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరికి మొదటిసారి రజస్వల అయ్యే వరకూ దాని గురించి ఏమీ తెలియదు. మిగిలిన ఒక్కరికి తెలిసిందీ అరకొరగానే. 88శాతం మంది ఆడపిల్లలు, ఆడవాళ్లు కూడా సురక్షితమైన నాప్కిన్లని కాకుండా, అందుబాటులో ఉన్న పాత దుస్తుల్ని, ఇటుకపొడినీ, ఆకులనీ వాడుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు నెలసరి అసౌకర్యం కారణంగా బడికి వెళ్లడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే నెలసరి చైతన్యాన్ని పెంచాలి.

- అదితీ గుప్తా, మెనుస్ట్రుపీడియా స్థాపకురాలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్