ఆస్వాదించండి.. చాలు!

అయిదేళ్ల వయసులో క్రికెట్‌తో ప్రేమలోపడ్డా. కానీ నాతో ఆడటానికి స్నేహితురాళ్లెవరూ వచ్చే వారు కాదు. నాకన్నా పెద్ద అబ్బాయిలతో ఆడాల్సొచ్చేది.

Published : 15 Nov 2022 00:47 IST

అనుభవపాఠం

అయిదేళ్ల వయసులో క్రికెట్‌తో ప్రేమలోపడ్డా. కానీ నాతో ఆడటానికి స్నేహితురాళ్లెవరూ వచ్చే వారు కాదు. నాకన్నా పెద్ద అబ్బాయిలతో ఆడాల్సొచ్చేది. అమ్మా నాన్నల ప్రోత్సాహం ఉండేది కదా! ధైర్యంగా ఆడేదాన్ని. నన్ను జాతీయ జట్టులో చూడాలన్నది వాళ్ల కల. ఎప్పుడూ అదే నా మనసులో మెదిలేది. అందుకే పట్టుదలగా ఆడే దాన్ని. త్వరగానే జాతీయ జట్టులో స్థానం సంపాదించా. ఎప్పుడు మంచి స్కోరు రాకపోయినా నా జీవితంలో ఇదో చెడ్డ రోజు అనుకునే దాన్ని. తర్వాత ఆలోచించా... ‘స్టేడియంలోకి అడుగుపెట్టగలిగా. ఎంతోమంది కలలు కనే భారత జట్టు జెర్సీ ధరించ గలుగుతున్నా. ఎంత అదృష్టవంతురాలిని!’ అనుకోవడం మొదలుపెట్టా. పరుగుల సంగతి పక్కనపెట్టి ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెడుతున్నా. భయపడకపోవడం అశ్రద్ధ కాదని తెలుసుకున్నాక మెరుగ్గా ఆడగలుగుతున్నా. మీరూ అంతే! ఎంచుకున్న పని, రంగమేదైనా సాధిస్తానా అని కంగారుపడొద్దు. ఆస్వాదిస్తూ వెళ్లండి.. విజయాలు అనుసరిస్తాయి. - స్మృతి మంధాన, క్రికెటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్