కలలు.. పరుగాపలేదు

నిరుపేద కుటుంబంలో పుట్టా. వీధి లైట్ల కింద చదువుకొని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించుకొన్నా. ఇక అంతా సంతోషమే అనుకుంటూ ఎన్నో కలలు కన్నాను. ఓ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. హైదరాబాద్‌ నుంచి ఫరీదాబాద్‌ వెళ్లడానికి రైలెక్కితే, ఎవరో దుండగులు నా చేతిలో బ్యాగు లాక్కొన్నారు.

Published : 26 Nov 2022 00:14 IST

నిరుపేద కుటుంబంలో పుట్టా. వీధి లైట్ల కింద చదువుకొని ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించుకొన్నా. ఇక అంతా సంతోషమే అనుకుంటూ ఎన్నో కలలు కన్నాను. ఓ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. హైదరాబాద్‌ నుంచి ఫరీదాబాద్‌ వెళ్లడానికి రైలెక్కితే, ఎవరో దుండగులు నా చేతిలో బ్యాగు లాక్కొన్నారు. వాళ్లను తరుముతుంటే పట్టుతప్పి ట్రైన్‌ ఫుట్‌బోర్డు కిందకు జారి పోయా. మూడు బోగీలు నాపైనుంచి వెళ్లాయి. ఎవరో చెెయిన్‌లాగి రైలు ఆపి నన్ను ఆసుపత్రికి తరలించారు.  వైద్యులు నా ఎడమ మోకాలు కింద నుంచి తొలగించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరడానికి ఆరునెలలు పట్టింది. మరొకరి చేయూత లేనిదే అడుగేయలేని పరిస్థితిలో దక్షిణ్‌ పునరావాసకేంద్రంలో చేరా. ఈ సంస్థ, అవసరమైతే కృత్రిమకాలు, బ్లేడు వంటి సౌకర్యాలను అందిస్తుంది. అక్కడ నాలాంటి వారిని చూస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొన్నా. అక్కడి వైద్యులు నా కాలికి బ్లేడు అమర్చారు. డాక్టరు సాయంతో అతికష్టంమీద అడుగులేసిన నేను, పరుగు కోసం సాధన మొదలుపెట్టా. మొదటిసారి 5 కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొని సాధించగలనని నిరూపించుకొన్నా. ఎక్కడ మారథాన్‌లు జరిగినా పాల్గొంటూ నాలాంటి వారిలో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తున్నా. పరిగెట్టేటప్పుడు బ్లేడు వల్ల మోకాలి వద్ద భరించలేని నొప్పి. ఆ సమయంలో లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకునేదాన్ని. దేశంలో తొలి మహిళా బ్లేడ్‌ రన్నర్‌ని నేను. అవార్డుల కన్నా.. వైకల్యమున్నా అనుకున్నది సాధించొచ్చని స్ఫూర్తిని కలిగించడంలోనే నాకు సంతోషమెక్కువ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ఉంటే చాలు. విజయాలు మన దగ్గరకొస్తాయి.

- కిరణ్‌ కనోజియా, తొలి బ్లేడ్‌ రన్నర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్