Published : 04/12/2022 00:03 IST

మనం చేస్తే.. వాళ్లూ అనుసరిస్తారు!

అనుభవ పాఠం

లాక్‌డౌన్‌ అందరి జీవితాల్నీ గజిబిజి చేసింది. గతంలో నేను ఇంటికొచ్చే సరికి పెద్దబాబు తైమూర్‌ పడుకొనేవాడు. దాన్ని చూసి బాధపడేదాన్ని. కొవిడ్‌లో అందరం ఇంట్లోనే! అప్పుడే జెహ్‌ కూడా పుట్టాడు. ఇద్దరినీ చూసుకోవడం సవాలే. నాకేమో చిన్నవాడితో.. తైమూర్‌కేమో ఆటలతో నిద్ర వేళల్లో మార్పు వచ్చింది. ఎంతసేపూ కార్టూన్లతోనే కాలక్షేపం. ఇలాగే కొనసాగితే మంచిది కాదని గట్టిగానే చెప్పేదాన్ని. వాడేమో ‘పది నిమిషాలమ్మా’ అనేవాడు. ఊరుకుంటే సరే.. లేదంటే.. ‘మీరైతే నచ్చినట్టు టీవీ చూడొచ్చు. నేను మాత్రం ఆఫ్‌ చేయాలా’ అనేవాడు. అప్పట్నుంచి ముందు మేం చేసి.. తర్వాత వాడికి చెప్పే వాళ్లం. స్టార్‌ కిడ్స్‌ అనగానే కోరుకున్నది దొరుకుతుందని అందరి అభిప్రాయం. నా పిల్లలకు మాత్రం కష్టం తెలియాలనుకున్నా. పిల్లలకు ఏదైనా తొందరగా బోర్‌ కొట్టేస్తాయి. మళ్లీ మళ్లీ కొత్తవి కొనిమ్మని అడుగుతారు. నేను మాత్రం ఒప్పుకోను. అలా చేయడం వల్ల ఎంత వృథానో చెప్పి, వాటినే ఉపయోగించుకోమంటా. మరీ అవసరమైతేనే కొనిస్తా. ఉదాహరణగా నన్నే చూపిస్తా. నా వస్తువులు నేనే సర్దుకుంటా. వాడినీ అలాగే చేయమంటా. అంతెందుకు తైమూర్‌ మంచం, బొమ్మలు, పుస్తకాలు బాగున్నవి అన్నింటినీ దాచి ఉంచా. వాటినే ఇప్పుడు జెహ్‌కి ఉపయోగిస్తున్నా. దీంతో అర్థం చేసుకుంటాడు. పిల్లలు ఏదైనా చేయాలంటే ముందు మీరు పాటించండి. వాళ్లు తప్పక అనుసరిస్తారు. అమ్మగా నేను తెలుసుకొని, ఆచరిస్తున్న సూత్రమిది!

- కరీనా కపూర్‌, నటి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి