రంగుల కళ

‘జీవకళ ఉట్టిపడే పెయింటింగ్‌లు’ అనేమాట చాలాసార్లు వినుంటాం. ఈ అమ్మాయివి మాత్రం అచ్చమైనవాటినే పోలి ఉంటాయి. ‘స్కల్‌ప్చర్‌ పెయింటింగ్‌’తో దీన్ని సాధిస్తోంది దుస్స భవాని! విదేశాల నుంచీ ఆర్డర్లు అందుకుంటోంది. మాది వరంగల్‌. నాన్న శంకర్‌ వ్యాపారి. అమ్మ స్వర్ణలత గృహిణి. కొవిడ్‌కు ముందు చదువు నుంచి కొంత విరామం తీసుకున్నా.

Published : 04 Feb 2023 00:22 IST

‘జీవకళ ఉట్టిపడే పెయింటింగ్‌లు’ అనేమాట చాలాసార్లు వినుంటాం. ఈ అమ్మాయివి మాత్రం అచ్చమైనవాటినే పోలి ఉంటాయి. ‘స్కల్‌ప్చర్‌ పెయింటింగ్‌’తో దీన్ని సాధిస్తోంది దుస్స భవాని! విదేశాల నుంచీ ఆర్డర్లు అందుకుంటోంది.

మాది వరంగల్‌. నాన్న శంకర్‌ వ్యాపారి. అమ్మ స్వర్ణలత గృహిణి. కొవిడ్‌కు ముందు చదువు నుంచి కొంత విరామం తీసుకున్నా. ఆ సమయంలో ఆక్రిలిక్‌ పెయింటింగ్‌ వేస్తోంటే ఇంట్లోవాళ్లు, స్నేహితులు మెచ్చుకున్నారు. నిజానికి సరదాగా వేసేదాన్నే కానీ.. ఎక్కడా నేర్చుకోలేదు. ఆర్డర్లూ రావడం మొదలుపెట్టాయి. అప్పట్నుంచీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచడం ప్రారంభించా. ఫాలోయర్లూ పెరిగారు. ఓసారి ఓ రష్యన్‌ యువతి ఇన్‌స్టాలో ఒక పెయింటింగ్‌ ఆకట్టుకుంది. పరిశోధిస్తే ‘స్కల్‌ప్చర్‌ పెయింటింగ్‌’ అని తెలిసింది. త్రీడీ ఎఫెక్ట్‌లా కనిపించే ఆ ఆర్ట్‌ నాకు బాగా నచ్చింది. విదేశాల్లోనూ ఇప్పుడిప్పుడే దానికి ప్రాచుర్యం పెరుగుతోంది. అలా రెండేళ్ల క్రితం ఆ రష్యా ఆర్టిస్ట్‌ నుంచే నేర్చుకున్నా. తయారు చేసి ఇన్‌స్టాలో పెడితే అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్కాట్లాండ్‌.. ఇలా వివిధ దేశాల నుంచీ ఆర్డర్లు మొదలయ్యాయి. ఆసక్తి ఉన్నవారికి వర్క్‌షాప్‌లు నిర్వహించి నేర్పిస్తున్నా కూడా. దీనిలో ఎగ్జిబిషన్లు నిర్వహించే స్థాయికి ఎదగాలన్నది కల. అందుకే అడ్వాన్స్‌డ్‌ కోర్సు చేస్తున్నా.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్