అదీ ఇబ్బంది పెట్టడమే!

బరువు ఉన్నవాళ్లనే ఏడిపిస్తారు అనుకుంటాం కదా! పుల్ల, బక్కపలుచన అంటూ పెట్టే పేర్లూ ‘బాడీ షేమింగ్‌’ కిందకే వస్తాయి. దీన్ని నేను చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.

Updated : 05 Feb 2023 00:55 IST

- అతియా శెట్టి, నటి

రువు ఉన్నవాళ్లనే ఏడిపిస్తారు అనుకుంటాం కదా! పుల్ల, బక్కపలుచన అంటూ పెట్టే పేర్లూ ‘బాడీ షేమింగ్‌’ కిందకే వస్తాయి. దీన్ని నేను చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా. ఇక సినిమాల్లోకి వచ్చినపుడు, కేఎల్‌ రాహుల్‌తో నా బంధాన్ని బయటపెట్టాక ఇంకెన్ని వచ్చాయో! ‘నీ ముఖం సైకిల్‌ సీట్‌లా ఉంది, పై నుంచి కింది వరకూ చెక్కముక్కే, ఏ ఒంపులూ లేవు’.. ఇలా నా ముఖం నుంచి వేసుకునే వస్త్రాల వరకూ అన్నింటిపైనా వంకలు పెట్టేవారు. పైగా ‘బండగా ఉన్నావంటే బాధపడాలి. బక్కగా ఉన్నావనేగా అన్నది’ అని సర్దిచెప్పుకొనేవారూ బోలెడు మంది. కొంచెం తిను అన్న సలహాలూ వస్తాయి. ఇవన్నీ ఇబ్బంది పెట్టేవే. రాహుల్‌కు తగను, తను సరిగా ఆడకపోయినా నాదే పొరపాటంటూ నా సోషల్‌ మీడియా ఖాతాలో తిడుతూ మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇవన్నీ ఒకరి మానసిక స్థితి, ఆలోచనలపై ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించరు. ఈ మాటలు వినీ, కామెంట్లు చూసీ నన్ను నేను మార్చుకోవడంపై ఎంత శ్రద్ధ పెట్టేదాన్నో. అయినా కామెంట్లు ఆగలేదు. మెప్పించాలన్న ప్రయత్నంలో అలసిపోయా కూడా. అప్పుడే ఒక్కొక్కరిదీ ఒక్కో శరీరతత్వం.. నాది ఇది. ఎందుకు మారాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ప్రతి ఒక్కరి కోసం మారుతూ, వాళ్ల మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను కోల్పోతున్నానని అర్థమైంది. అప్పట్నుంచి ఆలోచించడం మానేసి ఆత్మవిశ్వాసం పెంచుకోవడంపై దృష్టిపెట్టా. ఇప్పుడెవరి కామెంట్లూ నన్ను బాధించలేవు. పట్టించుకున్నంత కాలమే బాధ. వదిలేసి చూడండి.. సమస్యే ఉండదు. మనం బతికేది ఎవరికోసమో కాదు కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్