దూసుకుపోతున్నారు!

అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు ఉద్యోగాలు దక్కించుకోవటంలోనూ దూసుకుపోతున్నారు. మగవాళ్లని మించి నౌకరీ సాధిస్తున్నారు.

Published : 08 Mar 2023 00:35 IST

అన్ని రంగాల్లోనూ తమదైన ముద్రవేసుకొంటూ ఎదుగుతున్న మహిళలు ఉద్యోగాలు దక్కించుకోవటంలోనూ దూసుకుపోతున్నారు. మగవాళ్లని మించి నౌకరీ సాధిస్తున్నారు. ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం ఈ ఏడాది మహిళా ఉద్యోగినుల సంఖ్య 52.8 శాతానికి పెరిగింది. వీరి సంఖ్య వచ్చే ఏడాది నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.

న్నాళ్లూ ఇల్లు కొనడంలాంటి కీలక బాధ్యతలు మగవాళ్ల పనే అనుకున్నారా? ఇక నుంచి ఆ అభిప్రాయం మార్చుకోండి. ఎందుకంటే ఈ రెండేళ్ల కాలంలో ఇళ్లు కొనే మహిళల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతోందని కొటక్‌మహీంద్ర బ్యాంకు వెల్లడించింది. మహిళలు ఉద్యోగాలు చేయడం, ఆర్థిక సాధికారత పెంచుకోవడమే ఇందుకు కారణమట.

ఉద్యోగాల కల్పనలో మహిళలకు సముచిత గౌరవం కల్పించే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. తాజాగా విడుదల చేసిన ఐదో ఎడిషన్‌ ప్రకారం తెలంగాణా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా డిగ్రీలో చేరుతున్నారు. 22-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో 1,46,039 మంది అడ్మిషన్లు పొందగా... అందులో అబ్బాయిలు 67,452 అమ్మాయిలు.. 78,587 మంది ఉన్నారు.

కుటుంబ, వ్యక్తిగత సమస్యల కారణంగా ఉద్యోగానికి విరామం ఇచ్చినా తిరిగి వృత్తిలో చేరిన వారి సంఖ్య ఆరు శాతం పెరిగింది. నాయకత్వ స్థాయిలో ఉండే  మహిళల సంఖ్య 8శాతానికి పెరిగిందని ఫౌండిట్ అనే నియామక సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్