చెక్కే.. కాన్వాసు!

‘పదాలకు దొరకని భావాలను కూడా వ్యక్తపరచగల మార్గం కళ’ అనేది కృష్ణ నమ్మకం. అందుకే స్నేహితులు, ఆప్తుల ప్రత్యేక దినాలకు తను గీసిన బొమ్మలను బహుమతులుగా అందించేది. వాటిని వాళ్లు మెచ్చుకొని జాగ్రత్తగా దాచుకోవడం చూసి సంబర పడిపోయేది. తన ప్రేమ ప్రకృతికి హాని కాకూడదన్నది ఆమె అభిప్రాయం.

Published : 10 May 2023 00:23 IST

‘పదాలకు దొరకని భావాలను కూడా వ్యక్తపరచగల మార్గం కళ’ అనేది కృష్ణ నమ్మకం. అందుకే స్నేహితులు, ఆప్తుల ప్రత్యేక దినాలకు తను గీసిన బొమ్మలను బహుమతులుగా అందించేది. వాటిని వాళ్లు మెచ్చుకొని జాగ్రత్తగా దాచుకోవడం చూసి సంబర పడిపోయేది. తన ప్రేమ ప్రకృతికి హాని కాకూడదన్నది ఆమె అభిప్రాయం. అందుకే పనికి రాని చెక్కలను ఎంచుకొని వాటిపై ప్రయోగాలు మొదలుపెట్టింది. ప్రకృతి అందాలు, వ్యక్తుల చిత్రాలను గీసేది. వాటికీ ఆదరణ రావడం చూసి, వేరే వాళ్లకీ తమ ఆత్మీయులకు బహుమతులుగా అందించే అవకాశం ఇవ్వాలనుకుంది. ఆలోచన రాగానే 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ద పెయింట్‌హాలిక్‌’ ప్రారంభించింది. కొంత మొత్తం తీసుకొని బొమ్మలు గీసివ్వడం మొదలుపెట్టింది. విదేశీ ఆర్డర్లూ అందుకుంటోంది. ఫ్రిజ్‌ మాగ్నేట్స్‌, డెస్క్‌ డెకార్‌, గృహాలంకరణ వస్తువులు.. ఇలా ఎన్నింటినో రూపొందిస్తోంది. త్వరలో సొంతంగా డెకార్‌ షాప్‌నీ ప్రారంభించనుందీ కేరళ అమ్మాయి. అన్నట్ట్టు తనో ఐటీ ఉద్యోగి. ఉద్యోగం చేస్తూనే వ్యాపకంగా దీన్ని చేస్తోంది. రెండింటి సమన్వయం ఎలా అంటే ‘ఇష్టమైన పని కష్టమనిపించదు. పైగా నా బొమ్మల ద్వారా ఎంతోమంది ముఖాల్లో విరిసే చిరునవ్వు ఒత్తిడిని దూరం చేస్తూనే ఆత్మసంతృప్తినీ కలిగిస్తుంద’ని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్