విమానాలెక్కి.. దూకేస్తుంది!

మెక్‌కెన్నా నైప్‌.. వీడియో పోస్ట్‌ చేసిందంటే చాలు.. టిక్‌టాక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వేదికేదైనా లక్షల్లో వీక్షణలుంటాయి. ‘అలా ఎలా చేయగలిగావంటూ’ ఆశ్చర్యపోతూ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇంతకీ ఆమేం చేస్తుందంటే.. ఫ్లోరిడాకు చెందిన కెన్నా.. స్కైడైవర్‌. ఇది ఈమె చిన్ననాటి కల.

Published : 23 May 2023 00:38 IST

మెక్‌కెన్నా నైప్‌.. వీడియో పోస్ట్‌ చేసిందంటే చాలు.. టిక్‌టాక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వేదికేదైనా లక్షల్లో వీక్షణలుంటాయి. ‘అలా ఎలా చేయగలిగావంటూ’ ఆశ్చర్యపోతూ మెసేజ్‌లు వస్తుంటాయి. ఇంతకీ ఆమేం చేస్తుందంటే..

ఫ్లోరిడాకు చెందిన కెన్నా.. స్కైడైవర్‌. ఇది ఈమె చిన్ననాటి కల. 18 ఏళ్ల వయసులో తొలిసారి ప్రయత్నించి, తర్వాత లైసెన్స్‌ సాధించింది. 22 ఏళ్ల వయసు నుంచి స్కైడైవింగ్‌ చేస్తోంది. అంటే విమానాల నుంచి వేల అడుగుల ఎత్తునుంచి కిందకి దూకి, ప్యారాచూట్‌ సాయంతో నేలమీదకి చేరడం. స్కైడైవింగ్‌ అనగానే చాలామంది భయపడతారు. అలాంటిది.. వేల అడుగుల ఎత్తులో ఆవు, మిక్కీమౌస్‌ వేషాలు వేసుకొని ఆమె చేసే విన్యాసాలు, ఆహారం తినడం, ఇతర స్కైడైవర్స్‌తో కలిసి వివిధ ఆకారాలను ఏర్పరచడం వంటివి చేస్తుంది. 8 వేల అడుగుల ఎత్తులో పిజ్జా తింటూ గుర్తింపు తెచ్చుకున్న తను ప్యారాచూట్‌ సాయం లేకుండా ఒక స్కైడైవర్‌ నుంచి మరొకరి మీదకి దూకే వీడియోతో అభిమానులనీ సంపాదించుకుంది. తాజాగా 10 వేల అడుగుల ఎత్తులో మేకప్‌ వేసుకుంటున్న వీడియో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు ఇలా పెట్టిందో లేదో అలా 6 లక్షల వీక్షణలు అందుకుంది. ఇప్పటివరకూ దాదాపు 500 జంప్స్‌ చేసిన తను ప్రొఫెషనల్‌ స్కైడైవర్‌ కూడా. ఈ క్రీడపై ఎక్కువ మందికి ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి సరదా వీడియోలు చేస్తున్నానంటోంది. అందుకే 27 ఏళ్ల కెన్నాను అందరూ ‘వైరల్‌ స్కైడైవర్‌’ అని పిలుస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్