మూతలతో మ్యూరల్‌ చేసి.. గిన్నిస్‌కెక్కి..

‘కాదేదీ కళకు అనర్హం’ అన్నాడో కవి. వృథా సీసా మూతలతో గోడపై  తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.  అంతేకాదు, అతి పొడవైన వాల్‌ మ్యూరల్‌గా గుర్తింపు పొంది గిన్నిస్‌ రికార్డులోనూ స్థానం సంపాదించుకుంది.  ఇది సౌదీ అరేబియా పర్యావరణ కార్యకర్త ఖులూద్‌ అల్‌ ఫద్లీ సృష్టి.

Published : 13 Sep 2023 02:55 IST


‘కాదేదీ కళకు అనర్హం’ అన్నాడో కవి. వృథా సీసా మూతలతో గోడపై  తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది.  అంతేకాదు, అతి పొడవైన వాల్‌ మ్యూరల్‌గా గుర్తింపు పొంది గిన్నిస్‌ రికార్డులోనూ స్థానం సంపాదించుకుంది.  ఇది సౌదీ అరేబియా పర్యావరణ కార్యకర్త ఖులూద్‌ అల్‌ ఫద్లీ సృష్టి. తన ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

సౌదీ అరేబియాను గౌరవించేలా అతి పొడవైన మ్యూరల్‌ ఆర్ట్‌ని రూపొందించాలనుకున్నారు ఖులూద్‌ అల్‌ ఫద్లీ. ఇందులో సౌదీలో ఉండే అందమైన భవనాలు, పర్వతాలు సహా దేశ పతాకం, అందులోని చిహ్నాలతోపాటు మక్కా, మదీనా వంటి పవిత్ర ప్రదేశాలకూ స్థానమివ్వాలనుకున్నారు. ‘సౌదీ జెడ్డా కార్నిచే గోడ నా ఆలోచనకు వేదికైంది. ఈ మొజాయిక్‌ వాల్‌ ఆర్ట్‌ కోసం మొత్తం వృథా ప్లాస్టిక్‌ మూతలనే వినియోగించాలనుకున్నా. ఇందుకు పలు పాఠశాలల విద్యార్థులు, స్నేహితులు, వారి కుటుంబాలు మాకు తోడుగా నిలిచారు. ప్లాస్టిక్‌ సీసా మూతలను సేకరించి మాకు అందించారు. ఇలా 383 చదరపు మీటర్ల మ్యూరల్‌కు 5 లక్షల సీసా మూతలను వినియోగించి అందమైన గోడ కళాకృతిని రూపొందించాం.   దీనికి మొత్తం ఎనిమిది నెలల కాలం పట్టింది. ఇదంతా వీడియో తీసి గిన్నిస్‌ రికార్డు నిర్వాహకులకు సమర్పించాం. వారు దీన్ని గుర్తించి ప్రపంచంలోనే అతి పొడవైన వాల్‌ మ్యూరల్‌గా నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన గిన్నిస్‌ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నా. వృథా మూతలతో చేసిన ఈ మ్యూరల్‌ పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన  కలిగిస్తుందన్నది నా నమ్మకం. పునర్వినియోగంతో వృథాను తగ్గించడమే కాదు, పర్యావరణాన్నీ కాపాడొచ్చని పిల్లలు దీనిద్వారా తెలుసుకోవాలనేది నా తపన. సౌదీ అరేబియాలో అందమైన భవనాలకు లోటు లేదు. ఆధ్యాత్మిక ప్రదేశాలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ ఈ మ్యూరల్‌లో పొందుపరచగలిగా. దీంతో ప్రపంచ రికార్డును సాధించడంతో పాటు మా దేశంపై గౌరవాన్ని తెలియ చేయగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటారు ఖులూద్‌ అల్‌ ఫద్లీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్