రక్షించే రబ్బర్‌బ్యాండ్‌!

ఆపదలో ఉన్నప్పుడు.. ఎవరో వస్తారని ఎదురుచూసే కన్నా మనమే సన్నద్ధంగా ఉండటం మంచిది కదా? కాలేజీ నుంచో, ఆఫీసు నుంచో వస్తున్నప్పుడు కాస్త ఆలస్యమైనా కంగారు పడకుండా చేస్తుందీ రబ్బర్‌బ్యాండ్‌.

Published : 28 Sep 2023 01:40 IST

ఆపదలో ఉన్నప్పుడు.. ఎవరో వస్తారని ఎదురుచూసే కన్నా మనమే సన్నద్ధంగా ఉండటం మంచిది కదా? కాలేజీ నుంచో, ఆఫీసు నుంచో వస్తున్నప్పుడు కాస్త ఆలస్యమైనా కంగారు పడకుండా చేస్తుందీ రబ్బర్‌బ్యాండ్‌. అదెలా అంటారా? చదివితే మీకే తెలుస్తుంది..

టీజింగ్‌ కారణంగా తోటి అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులు గమనించి పూజ కనిపెట్టిన పరిష్కారమే ఈ సేఫ్టీ రబ్బర్‌బ్యాండ్‌. కరీంనగర్‌ మానకొండూర్‌కు చెందిన సకినాల పూజ పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం చదువుతోంది. మధ్య తరగతి కుటుంబం. తండ్రి రమేష్‌ మెకానిక్‌. తల్లి సుమిత్ర. కాలేజీ అయ్యాక, క్యాంటిన్‌ సమయాల్లో పూజ స్నేహితురాళ్లు వాళ్లకు ఎదురైన టీజింగ్‌ అనుభవాల గురించి మాట్లాడేవారు. దీనివల్ల చదువుకు దూరమై పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ల గురించీ ఆమె తెలుసుకుంది. ‘మా కాలేజీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల రక్షణకు ఉపయోగపడే పరికరం చేయాలనుకుంటున్నట్లు మా ట్రైనర్‌కి చెప్పాను. నా ఆలోచన మెచ్చుకుని సాంకేతిక సాయాన్ని అందించారు. రెండు నెలలు కష్టపడి ఈ విమెన్‌ సేఫ్టీ రబ్బర్‌ బ్యాండ్‌ తయారుచేశా. సాధారణ రబ్బరు బ్యాండుల్లానే దీన్ని జడకు పెట్టుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులతో ఇబ్బంది, అసౌకర్యానికి గురవుతున్నట్లు అనిపిస్తే బ్యాండ్‌లో ఉండే బటన్‌ నొక్కితే చాలు పెద్దగా పోలీసు సైరన్‌ వినబడుతుంది. ఆ శబ్దానికి అవతలివాళ్లు భయపడి పారిపోతారు. అలా వెళ్లకపోతే బటన్‌ను రెండోసారి ప్రెస్‌ చేస్తే దగ్గర్లో ఉన్న షీటీమ్‌కు సందేశం వెళుతుంది. ‘నన్ను రక్షించండి.. నేను అపాయంలో ఉన్నా’ అంటూ మాటల రూపంలో ఈ సమాచారం చేరుతుంది. బ్యాండ్‌లో ఉన్న జీపీఎస్‌ యాక్టివేట్‌ అయి లొకేషన్‌ పోలీసులకు వెళుతుంది. దీన్ని మరింత డెవలప్‌చేసి అందరికి అందుబాటులోకి తేవాలన్నదే నా ఆశ’ అంటోంది పూజ .

- తన్నీరు శ్రీనివాస్‌రావు, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్