కళపై ప్రేమతో!

కొన్ని అభిరుచులు మనల్ని ఉన్న చోట నిలబడనీయవు. వాటితో ప్రేమలో పడేలా చేస్తాయి. పెళ్లూరి మాధవి బాలసుబ్రహ్మణ్యం కూడా అలా చిత్రలేఖనంతో ప్రేమలో పడి ఎన్నో ప్రశంసలనీ, అవార్డులనీ అందుకున్నారు..

Published : 09 Nov 2023 01:39 IST

కొన్ని అభిరుచులు మనల్ని ఉన్న చోట నిలబడనీయవు. వాటితో ప్రేమలో పడేలా చేస్తాయి. పెళ్లూరి మాధవి బాలసుబ్రహ్మణ్యం కూడా అలా చిత్రలేఖనంతో ప్రేమలో పడి ఎన్నో ప్రశంసలనీ, అవార్డులనీ అందుకున్నారు..

రంగుల బొమ్మలనే కాదు.. చార్‌కోల్‌తో వేసే నలుపు, తెలుపు బొమ్మలనీ అద్భుతంగా వేయగలగడం మాధవి ప్రత్యేకత. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఇంత చక్కని చిత్రాలని గీస్తున్న మాధవి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డులోనూ స్థానం దక్కించుకున్నారు. దర్శకుడు రాజమౌళి నుంచి ప్రశంసలూ అందుకున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగితే.. ‘నేను పుట్టింది మంగళగిరిలో అయినా పెరిగిందీ, చదువుకున్నదీ విశాఖపట్నంలో. నాన్న సింహాచలం దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అమ్మ సంస్కృత అధ్యాపకురాలు. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చేశా. 2008 ఆర్థికమాంద్యం సమయంలో ఉద్యోగంతోపాటు ఉపాధినిచ్చే అభిరుచి ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. అలా చిత్రలేఖనంలో సొంతంగా నైపుణ్యాలు పెంచుకున్నా. 2013లో నేను వేసిన సాయిబాబా చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో షేర్‌ చేయడంతో ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది. 2013లో పెళ్లయ్యింది. ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాం. మాకో బాబు. ప్రస్తుతం పూర్తి సమయం ఆర్ట్‌ కోసమే కేటాయిస్తున్నా’ అనే మాధవి చిత్రాలు యూఎస్‌, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలకు ఎగుమతి అవుతున్నాయి. 2021లో... 112 దేశాలకు చెందిన చిత్రకారులతో కలిసి గిన్నిస్‌ బుక్‌ రికార్డునీ నెలకొల్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన 50కి పైగా పోటీల్లో బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

- ఛత్రపతి యద్దనపూడి, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్