15 వేల అడుగుల ఎత్తులో..

సియాచిన్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అక్కడ విధులు నిర్వర్తించే అవకాశం అందుకున్నారు గీతికా కౌల్‌. శత్రువులతోపాటు వాతావరణపరంగానూ ప్రాణహానికి ఆస్కారముండే ఆ ప్రాంతంలో తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారీమె.

Updated : 07 Dec 2023 05:34 IST

సియాచిన్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అక్కడ విధులు నిర్వర్తించే అవకాశం అందుకున్నారు గీతికా కౌల్‌. శత్రువులతోపాటు వాతావరణపరంగానూ ప్రాణహానికి ఆస్కారముండే ఆ ప్రాంతంలో తొలి మహిళా మెడికల్‌ ఆఫీసర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారీమె.

స్నో లెపర్డ్‌ బ్రిగేడ్‌.. సరిహద్దుల్లో ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో పహారా, రక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా సిద్ధమయ్యే సైనిక విభాగమిది. దీని సభ్యురాలు కెప్టెన్‌ గీతిక కౌల్‌. సియాచిన్‌ బ్యాటిల్‌ స్కూల్‌ నుంచి శిక్షణ ముగించుకొని ఈ ఎత్తైన యుద్ధభూమిలో పోస్టింగ్‌ అందుకున్నారు. ఇక్కడ పనిచేయాలంటే శారీరకంగానే కాదు.. మానసికంగానూ చాలా దృఢంగా ఉండాలి. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం. అనుక్షణం మారే వాతావరణ పరిస్థితులు, ఏడాది పొడవునా గడ్డ కట్టించే చలి.. సర్వసాధారణం. అందుకే సియాచిన్‌లో పనిచేయడాన్ని సాహసంగా చెబుతారు. దీనికోసం కఠినమైన పరిస్థితులను తట్టుకోవడం, పొంచి ఉన్న అపాయాలను ఎదుర్కొంటూనే వైద్యసేవలు అందించడం వంటి పలు అంశాల్లో శిక్షణ తీసుకోవడమే కాదు.. ముందంజలో నిలిచారు గీతిక. రక్షణ రంగంలో అమ్మాయిలకు సమాన అవకాశాలను కల్పిస్తున్న తరుణంలో గాజు తెరలను బద్ధలు కొడుతూ ఈ అవకాశాన్ని దక్కించుకున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్