శ్రద్ధ... స్పానిష్‌ మోడల్‌

లండన్‌ వీధులన్నీ ఎప్పటిలా రద్దీగా ఉన్నాయి. అంతలో నింగి నుంచి నేలకు  దిగివచ్చిన తారలా రహదారిలో ఆమె ప్రత్యక్షమైంది. భారతీయ సంస్కృతిని చాటే దుస్తుల్లో వయ్యారంగా అడుగులేస్తున్న ఆమెను చూసి ఇది కలా నిజమా అనుకున్నారంతా.

Published : 21 Feb 2024 01:41 IST

లండన్‌ వీధులన్నీ ఎప్పటిలా రద్దీగా ఉన్నాయి. అంతలో నింగి నుంచి నేలకు  దిగివచ్చిన తారలా రహదారిలో ఆమె ప్రత్యక్షమైంది. భారతీయ సంస్కృతిని చాటే దుస్తుల్లో వయ్యారంగా అడుగులేస్తున్న ఆమెను చూసి ఇది కలా నిజమా అనుకున్నారంతా. అచ్చం పెళ్లికూతురిలా తయారై, లండన్‌ వీధుల్లో అలవోకగా అడుగులేసిన  ఆమెను చూసినవారు నివ్వెరపోయారు. మెట్రోలో ఆమె ప్రయాణించినప్పుడు అందరి  చూపు ఆమెపైనే ఉంది. ఇంతకీ.. ఆమె మరెవరో కాదు.. భారతీయ మూలాలున్న  స్పానిష్‌ మోడల్‌ శ్రద్ధ...

లండన్‌లో మోడల్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్ల్లూయెన్సర్‌గా, మార్కెటింగ్‌ నిపుణురాలిగా స్థిరపడింది శ్రద్ధ. ఓరోజు భారతీయ సంప్రదాయ వధువులా, ఎంబ్రాయిడరీ చేసిన ఎరుపు రంగు లెహెంగా ధరించి రహదారుల్లో షికారు చేసింది. మెట్రోలో ప్రయాణించింది. తనను చూసిన వారి నుంచి వచ్చిన స్పందనల వీడియోను ఇన్‌స్టాలో పొందుపరిచింది. అంతే.. ఇది వైరల్‌ అయ్యింది. సోషల్‌మీడియాలో తుఫాను రేపింది. ఏకంగా 4.4 కోట్లమంది దీన్ని వీక్షించారు. అంతా  శ్రద్ధను ‘వావ్‌.. అద్భుతం’ అన్నారు. మహారాణిలా ఉన్నావు, ఫిదా అయ్యామంటూ పొగడ్తలతో  ముంచెత్తారు. ‘ఈ వీడియోకు ఇంత స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదం’టుందీమె.  విదేశీ వస్త్రధారణకు అతీతంగా వారసత్వ దుస్తులను ధరించి  ప్రపంచవేదికపై ప్రదర్శించావంటూ శ్రద్ధాపై అందరూ ప్రశంసలవర్షం కురిపిస్తుంటే... ‘నచ్చినచోట నచ్చినవాటిని ధరించడంలో ఉండే ఆనందం మరెక్కడా ఉండద’ని  చెబుతుంది శ్రద్ధ. ఎప్పటికప్పుడు వచ్చే ఫ్యాషన్లతోసహా సంప్రదాయ చీరనూ ధరించిన  వీడియోలను ఈమె పోస్ట్‌ చేస్తుంటుంది. ప్రపంచమంతా తిరుగుతూ.. జీవితాన్ని  ప్రేమించడం నేర్చుకుంటున్నాననే ఈ మోడల్‌ ఇన్‌స్టాకు 1,68,000మంది ఫాలోయర్స్‌  ఉండటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్