ఆకాశం నుంచి... ఓటు అవగాహన!

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ‘బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ బలమైనద’ని అబ్రహాం లింకన్‌ అన్నమాట. మరి అంత బలమైన ఓటును ఉపయోగించుకోకపోతే ఎలా?

Updated : 09 May 2024 07:35 IST

ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ‘బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ బలమైనద’ని అబ్రహాం లింకన్‌ అన్నమాట. మరి అంత బలమైన ఓటును ఉపయోగించుకోకపోతే ఎలా? ఓటు గొప్పతనం అందరికీ తెలియజేయాలని కొందరమ్మాయిలు తమదైన రీతిలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన దివ్యా కామత్‌, వేలమైళ్లు ప్రయాణించి ఓటేసి వస్తే... వడోదరకు చెందిన అడ్వెంచరస్‌ క్రీడాకారిణి శ్వేతా పామర్‌, వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్‌ చేస్తూ ‘ఓట్‌ ఇండియా’ అని రాసి ఉన్న జెండాను ఆకాశంలో ఎగరవేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తోంది. 2016లో సాహసాలను మొదలుపెట్టిన శ్వేత, గుజరాత్‌ నుంచి మొట్టమొదటి మహిళా స్కై డైవర్‌. దేశంలో నాలుగో మహిళ. ఇలా అవగాహన కల్పించడం శ్వేతకు మొదటిసారి కాదు, ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ‘ఎర్త్‌ డే’ సందర్భంగా ‘నో ప్లాస్టిక్‌’ అనే జెండాతో 13వేల అడుగుల ఎత్తునుంచి డైవ్‌ చేసింది. 18ఏళ్లకే తండ్రిని కోల్పోయిన ఈమె... తోబుట్టువులు, స్కాలర్‌షిప్‌ల సాయంతో ఎంబీఏ పూర్తిచేసింది. ఆంత్రప్రెన్యూర్‌గా, కంటెంట్‌ క్రియేటర్‌గా, స్కీయింగ్‌లాంటి సాహస క్రీడల్లోనూ సత్తా చాటుతోంది. యునైటెడ్‌ స్టేట్స్‌ పారాచూట్‌ అసోసియేషన్‌ (యూఎస్‌పీఏ-సీ) లైసెన్సు సాధించిన శ్వేత, ప్రపంచంలో ఎక్కడైనా స్కైడైవ్‌ చేయొచ్చు. ఇప్పటివరకూ తన కెరియర్‌లో దాదాపు మూడొందల డైవ్స్‌ చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్