సైన్స్‌లోకంలో విహరిద్దాం రండి!

ఎండలు మండిపోతున్నాయి. బయటకు అడుగుపెట్టాలంటేనే భయంగా ఉంది కదూ! మనదగ్గరే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి.

Updated : 09 May 2024 14:47 IST

ఎండలు మండిపోతున్నాయి. బయటకు అడుగుపెట్టాలంటేనే భయంగా ఉంది కదూ! మనదగ్గరే కాదు ప్రపంచమంతా ఇదే పరిస్థితి. భూతాపం తగ్గించకపోతే భవిష్యత్తులో ప్రతిరోజూ రోహిణీకార్తెలానే ఉంటుంది మనకి. మరి దీనికి పరిష్కారం ఏంటంటారా? భూతాపాన్ని తగ్గించి, సంప్రదాయేతర ఇంధనాల గురించి తెలుసుకోవడం ఒక మార్గం. ఇలాంటి మార్గాలు చాలానే ఉండొచ్చు. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అంటారేమో! ఇవన్నీ తెలుసుకోవడానికి లండన్‌లో సైన్స్‌ మ్యూజియం ఉంది.

ఇక్కడ ఒక్క సంప్రదాయేతర ఇంధనాల గురించే కాదు... ఈ భూమి పుట్టినప్పట్నుంచీ జరిగిన అభివృద్ధికి సంబంధించిన ప్రతి సైన్స్‌ విషయం గురించీ లోతుగా తెలుసుకోవచ్చు. సైన్స్‌, సాంకేతికతకు సంబంధించిన మూడున్నర లక్షల వస్తువులని మనం ఇక్కడ చూడొచ్చు. వాటి చరిత్రనూ తెలుసుకోవచ్చు. ఔషధాలు, యంత్రాలు, నక్షత్రాలు, ఏఐ... ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా వాటికి సంబంధించిన ప్రత్యేక గ్యాలరీలు ఇక్కడ ఉంటాయి. స్టీఫెన్‌ హాకిన్స్‌ ఆఫీస్‌, విమెన్‌ ఇన్‌ మ్యాథ్స్‌, తొలినాటి రైళ్లు వంటి ఆసక్తికరమైన విషయాలకు లెక్కేలేదు. ఒక్కోటిఒక్కో అద్భుతం. సైన్స్‌ సినిమాలూ వీక్షించొచ్చు. పరిశోధనలపై ఆసక్తి ఉన్న పిల్లలూ, పెద్దలూ ఇక్కడ జరిగే వర్క్‌షాపులు, ఓపెన్‌టాక్స్‌లో పాల్గొనవచ్చు. తాజాగా మనదేశానికి చెందిన అదానీ గ్రూప్‌ గ్రీన్‌ ఎనర్జీ గ్యాలరీని ప్రారంభించింది. భవిష్యత్తులో మనం వాడబోయే ఇంధనాల గురించీ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ అక్కడకు వెళ్లి చూడలేం అనుకొనే వారికి ఆన్‌లైన్‌లో కూడా కొన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. వండర్‌ల్యాబ్‌ విభాగంలోకి వెళ్తే ఇక్కడ పిల్లలకు నచ్చే యాక్టివిటీస్‌ బోలెడు ఉంటాయి. నీడపట్టునే ఉంటూ పిల్లలు సరదాసరదాగా సైన్స్‌ నేర్చేసుకోవచ్చు. వందల ఏళ్లనాటి పురాతన వస్తువులని త్రీడీలో చూసి ఆనందించేయొచ్చు.

ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్