వాళ్ల మాటలు విని సంతోషం ఆవిరైంది..!

వరసగా రెండేళ్లు ప్రమోషన్‌ అందుకున్నా. ఏడాదిలో రెండు మూడుసార్లకు మించి ఊరు కూడా వెళ్లకుండా పనిచేశానంటే ఎంత కష్టపడ్డానో ఊహించుకోవచ్చు. ఎంత ఆనందించానో.

Published : 15 May 2024 16:15 IST

వరసగా రెండేళ్లు ప్రమోషన్‌ అందుకున్నా. ఏడాదిలో రెండు మూడుసార్లకు మించి ఊరు కూడా వెళ్లకుండా పనిచేశానంటే ఎంత కష్టపడ్డానో ఊహించుకోవచ్చు. ఎంత ఆనందించానో. ప్యాంట్రీలో ఎవరూ లేరనుకున్నారేమో నా టీమ్‌ వాళ్లే బ్యాక్‌ డోర్‌ ద్వారా ప్రమోషన్‌ తెచ్చుకున్నానంటూ చాలా అసహ్యంగా మాట్లాడారు. అది విని సంతోషం ఆవిరవ్వడమే కాదు, చాలా బాధేసింది. వాళ్లమీద ఫిర్యాదు ఇవ్వాలా? విననట్టు ఉండిపోవాలా?

 ఓ సోదరి

పైవాళ్లు పొగిడినప్పుడో లేదా జీవితంలో ఓ మెట్టు ఎదిగినప్పుడో ఇలాంటి నెగెటివిటీని చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి వాటికి ఎక్కువగా బాధితులు అవుతుంటారు. అసూయ ఉన్నవాళ్లు మన వెనకాల, ఒక్కోసారి ఎదురుగానే అనీ అననట్లు మాట్లాడుతుంటారు. వాళ్లు అలా మాట్లాడడం బాధాకరమే. అయితే ఇలాంటి వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకండి. ఎందుకంటే ప్రతి సంస్థలోనూ ఇలాంటి వాళ్లు ఉంటూనే ఉంటారు. ఇతరుల విజయాలను చూసి అసూయ పడుతుంటారు. అమ్మాయిలు ఎదుగుతున్నారంటే వాళ్లపై రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి. ఇలాంటప్పుడు వాటిని మరింత హుందాగా డీల్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ముందు వాళ్లను పిలిచి మాట్లాడండి. ఇకపై ఎటువంటి విరోధానికీ తావులేకుండా నిజాయతీగా మాట్లాడమనండి. వారి ప్రవర్తన వల్ల టీమ్‌ ప్రదర్శన కూడా దెబ్బతింటుందని చెప్పండి. మనతో పనిచేసే వాళ్లందరూ మన విజయాన్ని చూసి సంతోషిస్తారని అనుకోలేం. కాబట్టి మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించే వాళ్లమీద కంటే మీ ప్రతిభను గుర్తిస్తున్న పైవాళ్లను దృష్టిలో ఉంచుకుని పనిచేయండి. ఇలాంటివి ఆలోచిస్తూ మీ లక్ష్యాన్ని మరవకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్