కేన్స్‌లో అసోం అందం!

ఏటా జరిగే కేన్స్‌ చలనచిత్రోత్సవంలో ఫ్యాషన్లది ప్రత్యేక స్థానం. అందుకే, పేరెన్నికగన్న డిజైనర్లెందరో తమ దుస్తులూ, నగల ప్రదర్శనకు దీన్ని వేదికగా చేసుకుంటారు. అయితే, ఈ ఏడాది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వారిలో మన భారతీయ తారలూ, డిజైనర్లూ ఉన్నారు.

Published : 21 May 2024 01:06 IST

టా జరిగే కేన్స్‌ చలనచిత్రోత్సవంలో ఫ్యాషన్లది ప్రత్యేక స్థానం. అందుకే, పేరెన్నికగన్న డిజైనర్లెందరో తమ దుస్తులూ, నగల ప్రదర్శనకు దీన్ని వేదికగా చేసుకుంటారు. అయితే, ఈ ఏడాది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వారిలో మన భారతీయ తారలూ, డిజైనర్లూ ఉన్నారు. వారిలో ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ ఆక్వా బ్లూ గౌన్‌లో మెరిసిపోగా, ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నాన్సీ త్యాగి తాను స్వయంగా డిజైన్‌ చేసుకున్న దుస్తులతో కేన్స్‌లో నడిచారు. ఇప్పుడు అసోం నటి యెమీ బారువా వంతు. భారతీయతనూ, తమ రాష్ట్ర సంప్రదాయాల్నీ ప్రతిబింబించేలా తయారై రెడ్‌కార్పెట్‌పై నడిచారు. ముఖ్యంగా అహోమ్‌ రాజవంశ కాలం నాటి ముగా సిల్క్‌తో చేసిన మేఖేలా ఛాదర్‌ని ధరించారామె. దీన్ని వందల ఏళ్ల నాటి గోజ్‌ బోటా వంటి ప్రాచీన డిజైన్‌లతో తీర్చిదిద్దారు. ఇక ముంజేతికి కడియం, చేతిపై తెలుపు వస్త్రంపై ఎరుపు రంగు డిజైన్లతో చేసిన కండువా, తలలో ఫాక్స్‌టైల్‌ ఆర్కిడ్‌ పూలు పెట్టుకుని అందరినీ ఆకర్షించారు. ఈ ప్రయత్నం ‘అసోం వాసిగా తన ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తోందని’ చెబుతున్నారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్