రంగుల కళలో రాణిస్తూ...

మండల ఆర్ట్‌...  క్లే ఆర్ట్‌... ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌... గ్లాస్‌ పెయింటింగ్‌... ఇలా వైవిధ్యమైన కళల్లో రాణిస్తున్న మేడా సింధూశ్రీ చదువుకుంటూ కూడా మనసుకి నచ్చిన పనిచేయొచ్చని నిరూపిస్తోంది. కళనే ఆదాయ వనరుగా మార్చుకుంది...

Published : 23 May 2024 01:19 IST

మండల ఆర్ట్‌...  క్లే ఆర్ట్‌... ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌... గ్లాస్‌ పెయింటింగ్‌... ఇలా వైవిధ్యమైన కళల్లో రాణిస్తున్న మేడా సింధూశ్రీ చదువుకుంటూ కూడా మనసుకి నచ్చిన పనిచేయొచ్చని నిరూపిస్తోంది. కళనే ఆదాయ వనరుగా మార్చుకుంది...

వాటర్‌కలర్స్, ఆయిల్‌కలర్స్‌... ఇలా ఏదో ఒక కళా మాధ్యమాన్ని ఎంచుకుని చిత్రలేఖనంలో రాణించేవారే ఎక్కువ. సింధూ అలా కాదు.. ఫొటోగ్రఫీ, పేపర్‌ క్విల్లింగ్, క్లే ఆర్ట్, జ్యూయలరీ డిజైనింగ్‌ సహా నేటితరానికి నచ్చే అన్ని మాధ్యమాల్లోనూ ప్రయోగాలు చేస్తూ, శభాష్‌ అనిపించుకుంటోంది. దానికి కారణం తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే అంటోందీ అమ్మాయి. విజయవాడలోని అయ్యప్పనగర్‌కి చెందిన సింధు అమ్మానాన్నలు రజనీ, సతీష్‌లు ఇద్దరూ చిత్రకారులే. దాంతో మూడేళ్ల వయసు నుంచే తనూ కుంచెను ప్రేమించింది. ఓ పక్క చదువుతూనే.. మండల ఆర్ట్, పెన్సిల్‌ ఆర్ట్, ఫ్యాబ్రిక్, గ్లాస్‌ పెయింటింగ్, స్టిల్‌లైఫ్‌ పెయింటింగ్, కొలాజ్‌ ఆర్ట్‌ల్లో రాణిస్తోంది. వీటితోపాటు ల్యాండ్‌ స్కేప్‌ ఆర్ట్, రియలిస్టిక్‌ పెయింటింగ్‌ల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఫొటోగ్రఫీ, చిత్రలేఖన ప్రదర్శనల్లో పాల్గొంటూ తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్న సింధూ తీరిక సమయాల్లో ఆర్ట్, క్రాఫ్ట్‌ ఆర్డర్లు తీసుకుని.. అలా వచ్చిన ఆదాయంతో కాలేజీ ఫీజులు కట్టుకుంటోంది. గత ఏడాది మహానంది అవార్డునీ గెలుచుకుంది.

టి.చిరంజీవి, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్