వేలంటైన్స్‌ డే.. ‘సోలో’గా ఇలా!

వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ప్రేమికుల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకే రోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటుంటారు ప్రేమికులు.

Published : 13 Feb 2024 20:02 IST

వేలంటైన్స్ డే వచ్చిందంటే చాలు.. ప్రేమికుల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం ప్రపంచంలోని ప్రేమంతా తమలోనే నిండినట్లు.. ఏడాది మొత్తం ప్రేమను ఒకే రోజు చూపించేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటుంటారు ప్రేమికులు. కానీ వేలంటైన్స్ డే రోజు ఒంటరిగా ఉండే వారి పరిస్థితేంటి? అందులో ఏముంది.. ఇతర రోజుల్లాగే ఇదీ గడిచిపోతుంది అంటారా? కానీ ప్రేమలో పడకుండా ఒంటరిగా, లేదంటే బ్రేకప్‌ అయి ఒంటరిగా ఉన్న వాళ్లూ వేలంటైన్స్‌ డేను హ్యాపీగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

మీకు మీరే వేలంటైన్!

ప్రపంచంలో మనల్ని ఎంతగానో ఇష్టపడే మొదటి వ్యక్తి మనమే! మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఈ లోకంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ వేలంటైన్స్ డే రోజు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి లేరని బాధపడకుండా మీకు మీరే వేలంటైన్‌గా మారిపోండి.. ఎప్పటినుంచో మీరు కొనాలనుకుంటున్న వస్తువును కొని ఈ వేలంటైన్స్ డేకి మీకు మీరే కానుకగా ఇచ్చుకోండి. అలాగే వేలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన వంటకాలు తయారుచేసి లేదా ఆర్డర్ చేసుకొని ఆరగించండి.. ఈ రోజంతా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ట్రీట్ చేసుకోండి. మీలోని మంచి గుణాలన్నింటినీ ఒక చోట రాసి మీకు మీరే చదివి వినిపించుకోండి. దీనివల్ల మీ విలువేంటో మీకూ అర్థమవుతుంది.. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

స్నేహితులతో కాసేపు..

ఒకవేళ ఒంటరిగా సమయం గడపడం మీకు ఇష్టం లేకపోతే మీ స్నేహితులతో కలిసి వేలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీ మనసుకు దగ్గరైన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లోనే అందరూ కలిసి పార్టీ చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే మీ ఫ్రెండ్స్‌తో కలిసి పలు సాహసకృత్యాల్లోనూ భాగం కావచ్చు. ఇలా ఈ రోజును కాస్త కొత్తగా గడిపేయచ్చు.

ప్రేమ పంచండి..

ప్రేమకు హద్దులుండవు.. వేలంటైన్స్‌ డే రోజున ప్రేమికులే ప్రేమను పంచుకోవాలన్న నియమమూ లేదు. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా గడపచ్చు.. నచ్చిన బహుమతితో వాళ్లను సర్‌ప్రైజ్‌ చేయచ్చు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవచ్చు.. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్ని సందర్శించి.. వాళ్లకు దుస్తులు, స్వీట్లు పంచిపెట్టచ్చు. మీరు జంతు ప్రేమికులైతే యానిమల్ షెల్టర్స్‌కి వెళ్లి వాటితోనూ సమయం గడపవచ్చు. ఇలా సమాజ సేవలో దొరికే ఆనందం, సంతృప్తి ముందు అన్నీ దిగదుడుపే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్