చెలియకో చిరుకానుక

చూస్తూ చూస్తూ ఏడాది గడిచిపోయింది. కొవిడ్‌ ఆంక్షలు ఎంత సడలించినా నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే కొంచెం గుబులుగానే ఉంటోంది.

Published : 28 Dec 2022 01:10 IST

చూస్తూ చూస్తూ ఏడాది గడిచిపోయింది. కొవిడ్‌ ఆంక్షలు ఎంత సడలించినా నలుగురు కలిసి మాట్లాడుకోవాలంటే కొంచెం గుబులుగానే ఉంటోంది. పూర్వ వైభవం వచ్చే దాకా కొత్త సంవత్సర వేడుకను వాయిదా వేయలేం కదా! ఈ నేపథ్యంలో ఒకరిద్దరు ఆత్మీయ నేస్తాలతో వేడుక చేసుకోండి..

ఆమె చిత్రంతో.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మీ స్నేహితురాలి ఫొటో ముద్రించిన క్యాలెండర్‌, పోస్టర్‌, దుప్పటి (బ్లాంకెట్‌), కాఫీమగ్గు లాంటి కానుకేదైనా ఇవ్వండి. లేదంటే సెంట్‌బాటిల్‌ లాంటిది ఇవ్వండి. వీలైతే కలిసి ఏదైనా ఊరు వెళ్లి రండి. ఇలాంటివి మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి.

ఫ్యాన్సీ నగలు.. మీ నేస్తానికి గాజులూ గొలుసులంటే మక్కువనుకోండి.. ఫ్యాన్సీ నగలు వేల రకాల్లో దొరుకుతాయి. చేయాల్సిందల్లా ఆమెకి నచ్చే రంగులూ ఆకృతులకు తగ్గట్టుగా ఎంపిక చేయడం. 

హస్తకళలు.. కొందరికి హ్యాండీక్రాఫ్టులు తెగ నచ్చుతాయి. అలాంటివారికి నూలు లేదా నారతో తయారైన పర్సు, హ్యాండ్‌బ్యాగ్‌, కప్పులు లాంటివి బహూకరించండి!

అలంకరణ సామగ్రి.. కొందరికి డెకొరేటివ్‌ పీసెస్‌ నచ్చుతాయి. అలాంటి ఆసక్తి ఉంటే బొమ్మలు, అలంకరణ సామగ్రి, పెయింటింగులు లేదా వాల్‌ హ్యాంగింగులు ఇవ్వొచ్చు.

మొక్కలు.. మొక్కను మించిన కానుక లేదు. ఇది సజీవంగా ఉండి గొప్ప అనుభూతినిస్తుంది. కనుక ఆమె అభిరుచీ, ఆసక్తికి తగిన మొక్కను ఇచ్చేయండి.

తినుబండారాలు.. అబ్బా.. ఉన్న వస్తువులతోనే పిచ్చెక్కిపోతోంది.. ఇంకా కొత్తవొద్దు బాబోయ్‌ అంటారు కొందరు. మీ ఆత్మీయురాలు ఆ కోవకి చెందితే లంచ్‌ లేదా టీ పార్టీ ఇవ్వండి. అమెకిష్టమైన ఆహార పదార్థాలు చేసిపెట్టండి లేదా తెప్పించండి. కబుర్లు కలబోసుకుంటూ విందు ఆరగించండి. మీరు పంచుకున్న ఆనందం ఏడాదంతా తీపి గుర్తుగా ఉండిపోతుంది.

గ్రీటింగ్‌ కార్డు.. ఏదిచ్చినా దాంతోబాటు గ్రీటింగ్‌ కార్డు మర్చిపోవద్దు. మీ నెచ్చెలి పట్ల మీకున్న అభిమానాన్ని మాటల్లో వ్యక్తపరచండి. అంత కవిత్వం రాయలేనంటారా.. అయితే ఒక పొయెటిక్‌ కార్డును కొనివ్వండి.

పరిచయస్థులు వందలమంది ఉన్నా మనసుకు దగ్గరైన వాళ్లు కొద్దిమందే ఉంటారు. మన కష్టం, సుఖం, ఆనందం, ఆందోళన ఏదైనా వాళ్లతోనే పంచుకుంటాం. మరి కొత్త సంవత్సర వేడుకను అలాంటి ఆత్మీయ వాతావరణంలో చేసుకుంటే మరింత సంతోషమేగా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్