అది చూసి ఆత్మహత్య చేసుకోబోయింది.. తనను మార్చడమెలా?

నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. మాకు ఇద్దరమ్మాయిలు. అల్లుడితో గొడవలై పెద్దమ్మాయి ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది. మా మనవడిని అల్లుడి తరఫువారు తీసుకెళ్లారు. మేము మా మనవరాలిని తెచ్చుకున్నాం. తన వయసు 15 ఏళ్లు. తల్లి ఆత్మహత్యతో....

Updated : 27 Mar 2023 19:37 IST

నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. మాకు ఇద్దరమ్మాయిలు. అల్లుడితో గొడవలై పెద్దమ్మాయి ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది. మా మనవడిని అల్లుడి తరఫువారు తీసుకెళ్లారు. మేము మా మనవరాలిని తెచ్చుకున్నాం. తన వయసు 15 ఏళ్లు. తల్లి ఆత్మహత్యతో తను చాలా భయపడిపోయింది. తన బాధను మేము చూడలేకపోతున్నాం. ఒకసారి చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది. మేము చూడడం వల్ల తనని కాపాడుకోగలిగాం. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే.. తనలో సూసైడ్‌ టెండెన్సీ ఉందని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మా మనవరాలు తిరిగి మాములు జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ మనవరాలు తన చిన్నప్పటి నుంచి ప్రతికూల వాతావరణంలో పెరిగినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మీ పెద్దమ్మాయి ఆత్మహత్యకు కారణం భార్యాభర్తల మధ్య గొడవలు. సహజంగా భార్యాభర్తలు గొడవపడినప్పుడు దాని ప్రభావం పిల్లల మీద చాలా వరకు ఉంటుంది. అలాగే తోడుండాల్సిన వయసులో ఆమెకు తన తల్లి దూరమైంది. దీనికి తోడు ఆ సమయంలో తనకు ఆత్మహత్య అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఇవన్నీ ఆమెను మానసికంగా డిస్టర్బ్‌ చేసినట్టుగా అనిపిస్తున్నాయి.

ఆమెకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయన్నారు. ఇది డిప్రెషన్‌కి సంబంధించిన లక్షణం. కాబట్టి, తనని ఒక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తప్పనిసరిగా తీసుకెళ్లండి. వారు కొన్ని టెస్ట్‌లు చేసిన తర్వాత చికిత్స అందిస్తారు. వారు ఇచ్చే మందులను తప్పనిసరిగా వేసుకోవాలి. ఆ తర్వాత థెరపీల ద్వారా తను తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేయచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్