బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!

నా వయసు 29 సంవత్సరాలు. మాది ప్రేమ వివాహం. మాకు ఒక బాబు ఉన్నాడు. మేమిద్దరం కలిసే ఉంటున్నా భార్యాభర్తలమనే ఫీలింగ్‌ లేదు. ఇద్దరం కేవలం రూమ్మేట్స్‌లాగా ఉంటున్నాం. శారీరకంగా తను నాతో కలిసి చాలా కాలమైంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో చిరాకు వస్తోంది. చాలా బాధగా ఉంది. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి?

Published : 15 Apr 2024 12:32 IST

నా వయసు 29 సంవత్సరాలు. మాది ప్రేమ వివాహం. మాకు ఒక బాబు ఉన్నాడు. మేమిద్దరం కలిసే ఉంటున్నా భార్యాభర్తలమనే ఫీలింగ్‌ లేదు. ఇద్దరం కేవలం రూమ్మేట్స్‌లాగా ఉంటున్నాం. శారీరకంగా తను నాతో కలిసి చాలా కాలమైంది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో చిరాకు వస్తోంది. చాలా బాధగా ఉంది. ఈ సమస్య నుంచి నేనెలా బయటపడాలి? - ఓ సోదరి

జ. మన సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే చాలామంది పెద్దవారు దీనిని ఒక మైలురాయిగా మాత్రమే చూస్తున్నారు. అంతేకానీ దాని తర్వాత వచ్చే సవాళ్ల గురించి పిల్లల్ని పెళ్లికి ముందు నుంచే సిద్ధం చేయడానికి ప్రయత్నించడం లేదు. ఈ క్రమంలో పెళ్లైన కొంతకాలం తర్వాత మీలాంటి సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు.

వివాహ బంధంలో అడుగుపెట్టాక జీవిత భాగస్వామికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, తల్లిదండ్రులుగా కొత్త బాధ్యతలు చేపట్టినప్పుడు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ రెండు బాధ్యతలనూ సమన్వయం చేసుకోవడం ఎంతో అవసరం.

మీరిద్దరూ లైంగికంగా కలిసి చాలా కాలమైందని అంటున్నారు. పిల్లల పెంపకం, ఆఫీసు పని ఒత్తిళ్ల వల్ల కూడా లైంగికాసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీ భర్తకు ఇలాంటి ఒత్తిళ్లు ఉన్నాయేమో అడిగే ప్రయత్నం చేయండి. వాటిని తగ్గించుకోవడానికి గల మార్గాలను అన్వేషించండి.

మీరిద్దరూ కేవలం రూమ్మేట్స్‌లాగా ఉంటున్నామని చెబుతున్నారు. దీనిని బట్టి మీ మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమవుతోంది. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. దంపతుల మధ్య అనుబంధం దృఢంగా ఉంటే ఎలాంటి సమస్యలు దరి చేరవు. కాబట్టి మీ మధ్య అనుబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. మీది ప్రేమ వివాహం అని చెబుతున్నారు. అంటే పెళ్లికి ముందు కొన్ని మధుర జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలను పునరావృతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం కలిసి షాపింగ్‌కు వెళ్లడం, సినిమాలు చూడడం, రెస్టరంట్‌కు వెళ్లడం చేయచ్చు. వీలైతే ఏదైనా వెకేషన్‌కు వెళ్లడం మరీ మంచిది.

అలాగే దాంపత్య బంధంలో అరమరికలు లేకుండా ఉండాలంటే ఒకరి ఆలోచనలు మరొకరితో స్వేచ్ఛగా పంచుకోవడం ఎంతో అవసరం. కాబట్టి, జీవితంలో మీరు ఏం కోల్పోతున్నారో మీ భర్తకు వివరించే ప్రయత్నం చేయండి. అలాగే తనకు ఉన్న ఇబ్బందుల గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది. అప్పటికీ మీరు ఇబ్బంది పడుతుంటే ఇద్దరూ కలిసి రిలేషన్‌షిప్‌ నిపుణులను సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్