పర్యావరణంపై పిల్లలకు..

చిన్నారులకు పర్యావరణ కాలుష్యానికి గల కారణాలను అవగాహన కలిగించాలి. మనం రోజూ వినియోగించే వాటిని రీసైకిల్‌  ద్వారా ఎలా పునర్వినియోగించుకోవచ్చో నేర్పాలి. ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ వారినీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలి.

Published : 24 Dec 2022 00:14 IST

చిన్నారులకు పర్యావరణ కాలుష్యానికి గల కారణాలను అవగాహన కలిగించాలి. మనం రోజూ వినియోగించే వాటిని రీసైకిల్‌  ద్వారా ఎలా పునర్వినియోగించుకోవచ్చో నేర్పాలి. ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ వారినీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలి.

బొమ్మలు కావాలని అడిగినప్పుడు పాతవాటినేం చేశారో చూడాలి. అవి పనిచేయడం లేదంటే తిరిగి వాటిని బాగుచేయడం నేర్పాలి. వాటితో బోర్‌ కొట్టిందంటే మరొకరికిద్దామని ఒప్పించాలి. వాటన్నింటినీ చక్కగా ప్యాక్‌ చేసి పేద పిల్లలకు కానుకగా ఇవ్వడం అలవాటు చేయాలి. అందులో ఉండే సంతోషమెలా ఉంటుందో చిన్నారులకు బోధపడుతుంది. అలాగే కొత్తబొమ్మల ఎంపికలో చెక్కవి ఎంచుకునేలా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌, మెటల్‌ వంటివి త్వరగా భూమిలో కలవవు అనేది వారికి అవగాహన కలిగించాలి.

క్రాఫ్ట్‌తో.. క్రాఫ్ట్‌ వర్క్‌ నేర్పిస్తే వారిలోని సృజనాత్మకత బయటకొస్తుంది. పాత అట్టపెట్టెలతో బొమ్మలు తయారు చేయడం, పనికి రాని వస్తువులతో గృహోపకరణాలు చేసి వారి గది గోడకు తగిలించడం వంటివి చేయించాలి. ఇవన్నీ పిల్లల్లో రీసైకిల్‌ పద్ధతిని అలవడేలా చేస్తాయి. పాత అట్టలపై రంగులేసి అందమైన పెయింటింగ్స్‌గా మలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తే చిన్నారులూ దాన్ని అనుసరిస్తారు.

నీటిని.. శరీరానికి తగినంత మంచి నీటిని ఎలా తీసుకోవాలో చెప్పడంతోపాటు నీటిని వృథా చేయకూడదనేది నేర్పాలి. స్నానాలగది, వాష్‌బేసిన్‌ వద్ద అనవసరంగా నీటిని వృథా చేయకుండా మెలకువలు నేర్పాలి. పెద్దవాళ్లు ఇదే విధానాలను పాటిస్తే, పిల్లలూ వాటిని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ కాలుష్యం పర్యావరణంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియజేయాలి. అలా జరగకుండా ఉండాలంటే మనవంతు కృషి చేయాలని చెప్పాలి. వాతావరణంలో మార్పులు మన మనుగడకు ఎంత ప్రమాదమో చెబుతూ.. వాటి గురించి అవగాహన కలిగించే పుస్తకాలను చదివి వినిపించాలి.

రీసైకిల్‌తో.. బొమ్మలేకాదు, దుస్తులనూ రీసైకిల్‌ చేయడమెలాగో చెప్పాలి. పాత దుస్తులను కొత్తవాటిగా మార్చుకోవడంతోపాటు బిగుతైనవి పేద పిల్లలకు అందించేలా చేయాలి. వంటింటి వ్యర్థాలను పడేయకుండా మొక్కలకు ఎరువుగా ఎలా మారుతుందో చెప్పి, తయారీలో వారినీ భాగస్వాములను చేయాలి.  కొన్ని మొక్కలను వారికి దత్తత ఇచ్చి పెంచే బాధ్యతనివ్వాలి. పర్యావరణానికి పచ్చదనం ఎలా దోహదపడుతుందో చెబితే చాలు, వారిలో మొక్కల పెంపకంపై అవగాహన దానంతటదే వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్