‘స్వీయ ప్రేరణ’ పెంచొచ్చు!

‘స్వీయ ప్రేరణ’ ఈ పదాన్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ పిల్లలు చదువుల్లో ముందుండటానికి, పెద్దయ్యాక జీవితంలో విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. స్వీయ ప్రేరణ అలవరచుకున్న పిల్లలు మిగతా వారి కంటే ఎక్కువ తార్కిక శక్తిని కలిగి ఉండటమే కాక వాళ్ల నైపుణ్యాలను, జ్ఞానాన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి.

Published : 21 Jan 2023 00:02 IST

‘స్వీయ ప్రేరణ’ ఈ పదాన్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ పిల్లలు చదువుల్లో ముందుండటానికి, పెద్దయ్యాక జీవితంలో విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. స్వీయ ప్రేరణ అలవరచుకున్న పిల్లలు మిగతా వారి కంటే ఎక్కువ తార్కిక శక్తిని కలిగి ఉండటమే కాక వాళ్ల నైపుణ్యాలను, జ్ఞానాన్ని మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటారని పరిశోధనలు చెబుతున్నాయి.. పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని పెంచడానికి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఆశావాదాన్ని అలవరచాలి.. సమస్య వచ్చినప్పుడు దాన్నే తవ్వుకుంటూ కూర్చోకుండా పరిష్కార మార్గాన్ని అన్వేషించేలా పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చాలి. ఇలా చేయడం వల్ల జీవితం పట్ల వారిలో సానుకూల దృక్పథం అలవడుతుంది.


రిస్క్‌ తీసుకోనివ్వండి... ఫలితంతో నిమిత్తం లేకుండా పిల్లలు పని చేయడంలో చూపే చొరవని, వారి కష్టాన్ని గుర్తించి అభినందించండి. అలా చేయటం వల్ల వారు సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను సాధించడమే కాకుండా విజయం సాధిచేవరకూ ప్రయత్నిస్తారు. విజయాల్ని, అపజయాలను సమానంగా స్వీకరిస్తూ జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు.


లక్ష్యాలను నిర్దేశించండి.. పిల్లలకు వాళ్ల వయసుకు తగ్గ సవాళ్లు ఇవ్వాలి. దానివల్ల  పోరాట పటిమ అలవడుతుంది. కచ్చితమైన, స్పష్టమైన  లక్ష్యాలను ఇవ్వండి. దాన్ని నిత్యం చూసుకునేలా ఓ చార్టులా రూపొందించి ఇవ్వండి.


నేర్చుకునే గుణాన్ని పెంపొందించండి... పిల్లలకు ఆసక్తి ఉన్న విషయాలు నేర్చు కునేందుకు ప్రోత్సహించండి. దాంతో వారు విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు వారు ఆసక్తితో ఏదైనా ప్రయత్నించాలనుకుంటే చేయనివ్వండి. దాని వెనుక ఉన్న కష్టమేంటో అర్థమవుతుంది.


బహుమతులు ప్రతిసారీ వద్దు... పిల్లలు ఏది చేసినా బహుమతులు ఇవ్వడం కొందరికి అలవాటు. ఇష్టపడి చేసే పనికి కూడా  బహుమతులు ఇవ్వడం వల్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బహుమతులు ఇవ్వడం ఉత్తమం.


తల్లిదండ్రులే ఆదర్శం... పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి అమ్మానాన్నలు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మనం చేసిన పని  ఫలితం పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో అంచనా వేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్