అవగాహన లేకే అపార్థం

‘పెళ్లై పదేళ్లవుతోంది.... నాకేదిష్టమో కూడా ఆయనకి తెలియదని వాపోతుందో ఇల్లాలు. ‘తనకోసం ఎంతో చేస్తుంటా... కానీ తనేమో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావని గొడవ చేస్తుందని’ బాధ పడుతుంటాడో భర్త. ఇలాంటి సందర్భాలు... ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయి.

Published : 31 Dec 2022 01:12 IST

‘పెళ్లై పదేళ్లవుతోంది.... నాకేదిష్టమో కూడా ఆయనకి తెలియదని వాపోతుందో ఇల్లాలు. ‘తనకోసం ఎంతో చేస్తుంటా... కానీ తనేమో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావని గొడవ చేస్తుందని’ బాధ పడుతుంటాడో భర్త. ఇలాంటి సందర్భాలు... ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయి. వీటికి కారణం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవడమే అంటారు మానసిక నిపుణులు.

ఒక్కోసారి ఆలుమగల మధ్య వచ్చే అసంతృప్తులను చిన్నవే కదా అనో, నిత్యం జరిగేవేలే అనో కొట్టిపారేయకండి. పదే పదే ఒకటే తరహా ఇబ్బంది మీ భాగస్వామి నుంచి ఎదురవుతుంటే ఓ సారి తరచి చూసుకోండి. అప్పుడే వాస్తవాన్ని గ్రహించగలరు.  

ప్రతి వ్యక్తికీ కొన్ని కోరికలు, అంచనాలు, అభిరుచులు ఉంటాయి. ఎంత భార్యాభర్తలైనా మీ మనసులోని విషయాలను తెలుసుకోగలిగే అతీత దృష్టి ఏమీ మీ భాగస్వామికి ఉండదు. అలాంటప్పుడు ఊహించి మీకోసం ఏదో చేయాలని అంచనాలు వేసుకోవడం, ఆ పని చేయలేనప్పుడు నిరుత్సాహపడటం వంటివాటివల్లే గొడవలు. అలాకాకుండా... మీకేం కావాలో స్పష్టంగా చెప్పి చూడండి. మీరు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుంది.

భాగస్వామి ‘నన్ను పట్టించుకోవట్లేదు, నాకోసం ఏదీ చేయట్లేదు’ అంటుంటే... ముందు వారి అభద్రతను దూరం చేసేందుకు కాస్త సమయం కేటాయించండి. ఏకాంతంగా గడపడం, విహారయాత్రలకు వెళ్లి రావడం వంటివి చేయండి. అప్పుడు వారి బాధ ఇట్టే పోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్