ఏఐ టార్గెట్‌ వాళ్లేనా?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌... ప్రస్తుతం ఎవరినోట విన్నా ఇదేమాట.  ఇది సామాన్యుల్ని ఎలా ప్రభావితం చేసింది... దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది... వంటివాటిని పరిశోధించి ‘కోడ్‌ డిపెండెంట్‌’ అనే పుస్తకం రాశారు మధుమితా ముర్గియా. తాజాగా ఇది నాన్‌ ఫిక్షన్‌ కేటగిరీలో విమెన్స్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయింది.

Updated : 28 May 2024 17:34 IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌... ప్రస్తుతం ఎవరినోట విన్నా ఇదేమాట.  ఇది సామాన్యుల్ని ఎలా ప్రభావితం చేసింది... దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది... వంటివాటిని పరిశోధించి ‘కోడ్‌ డిపెండెంట్‌’ అనే పుస్తకం రాశారు మధుమితా ముర్గియా. తాజాగా ఇది నాన్‌ ఫిక్షన్‌ కేటగిరీలో విమెన్స్‌ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయింది.

నం ఎక్కడకు వెళ్తున్నాం, వస్తున్నాం... లాంటి ఎన్నో విషయాలు మన స్నేహితులైనా కనిపెట్టలేరేమో కానీ ఏఐ కనిపెడుతుంది. అసలు ఇప్పుడది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే ఆ వివరాలన్నీ చెప్పే కంపెనీలు కూడా ఉన్నాయట. అదెలానో తెలుసుకోవాలనుకున్నారు జర్నలిస్ట్‌ మధుమితా. కొన్ని షాడో కంపెనీలు మన ఆన్‌లైన్‌ డేటాను కలెక్ట్‌ చేసి, ఆ ప్రొఫైల్స్‌ను అమ్ముకుంటాయని తెలుసుకుంది. దాన్ని పరీక్షించడం కోసం ఆమె ఒక యాడ్‌టెక్‌ స్టార్టప్‌ను సంప్రదించింది. ఆమె వెబ్‌బ్రౌజర్‌ నుంచి తన గురించి సేకరించిన సమాచారాన్ని డీకోడ్‌ చేయమని అడిగింది. తీరా వారు పంపిన సమాచారం చూసి ఆశ్చర్యపోయింది. అందులో ఆమె పనిచేసిన చోటు, నివసించిన ప్రాంతం, గత ఏడాది ఆమె తీసుకున్న సెలవులు, డబ్బు ఎలా ఖర్చుచేసింది, తన అభిప్రాయాలు, రాజకీయ ఆసక్తులు, అలవాట్లు, వ్యక్తిత్త్వం... ఇలా ఎంతో సమాచారం కనిపించింది. ఆ తర్వాత దీనిపై ఏళ్లపాటు పరిశోధించి... తన పుస్తకం ‘కోడ్‌ డిపెండెంట్: లివింగ్‌ ఇన్‌ ద షాడో ఆఫ్‌ ఏఐ’ ద్వారా అనేక విషయాలు వెల్లడించింది. ఏఐ వల్ల సాధారణ ప్రజల జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయో ఈ పుస్తకంలో వివరించింది. కెన్యాలోని డేటా లేబర్ల (డేటా సెట్‌లను ట్యాగింగ్, లేబులింగ్‌ చేస్తూ ఏఐ సాఫ్ట్‌వేర్‌కు ఉపయోగపడేవాళ్లు) జీవితాలు దీనివల్ల ఎలా ప్రభావితమయ్యాయి? ఫేషియల్‌ రికగ్నిషన్‌ లేదా క్రిమినల్‌ జస్టిస్‌ ప్రిడిక్షన్‌ అల్గారిథమ్‌లో లోపాలు... వంటివాటిపై పరిశోధించింది. ఇలాంటి వాటికి మహిళలు, నల్లజాతీయులు, వలసదారులు, మైనారిటీలు, పేదవాళ్లే ఎక్కువగా బాధితులయ్యారట. సాంకేతికంగా ఏఐ ఎలా లోపభూయిష్ఠంగా ఉంటుందనే దాని గురించీ చర్చించింది. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఏఐ ఎడిటర్‌గా పనిచేస్తోందీమె. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్