Published : 05/07/2022 20:20 IST

బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!

జీవితంలో మన సుఖదుఃఖాల్లో పాలుపంచుకొనేవారు ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అది కుటుంబ సభ్యులైనా.. స్నేహితులైనా సరే..! మన గురించి ఆలోచించి.. కష్టాల్లో మనకు అండగా నిలబడేవారున్నట్త్లెతే అంతకు మించి మనం సంపాదించుకోగలిగిన ఆస్తి ఏముంటుంది? మనకు కలిగిన సంతోషాన్ని.. ఇతరులతో పంచుకొన్నప్పుడే అది రెట్టింపవుతుంది. అందుకే మన జీవితంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఓ భాగంగా ఉంటారు. అయితే వారందరితోనూ చక్కటి అనుబంధాన్ని కొనసాగించాలంటే కాస్త శ్రమ పడాల్సిందే.

విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించే వ్యక్తులతో ఎంతో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి.

అలాగే ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం స్నేహమైనా.. ప్రేమైనా.. కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు రావడం సహజం. కాబట్టి వాటిని తెగేవరకు లాగకుండా.. మనలోని అహాన్ని పక్కనపెట్టి ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

మీ జీవితంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఎంతో కొంత సమయం గడుపుతూ ఉండండి. వారు మీకు దూరంగా ఉన్నప్పటికీ వారానికోసారి ఫోన్‌లోనైనా మాట్లాడటానికి ప్రయత్నించండి. అప్పుడే బంధాలు బలపడతాయి.

గుర్తుంచుకోండి.. ఎప్పుడైనా సరే.. ఒక బంధానికి బ్రేక్ పడిందంటే మళ్లీ కొనసాగించడం అంత ఈజీ కాదు! అందుకే మీ జీవితంలో విలువైన బంధాలను పదిలంగా కాపాడుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని