అవి పక్కన పెట్టేయండి..

ఈ రోజుల్లో ఏ కాస్త సమయం దొరికినా భార్య భర్తలిద్దరూ చెరొక ఫోను పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా అయితే వారి మధ్య పదిలంగా ఉండాల్సిన బంధం చేజారిపోతుంది. గోరంత విషయాన్ని కొండంత చేస్తూ గొడవపడటం తప్ప సమస్యను సామరస్యంగా పరిష్కరించే మార్గం మాత్రం వెతకట్లేదు. ఇలా కాకుండా ఉండేందుకు నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు.

Published : 24 Mar 2023 00:39 IST

రోజుల్లో ఏ కాస్త సమయం దొరికినా భార్య భర్తలిద్దరూ చెరొక ఫోను పట్టుకొని కూర్చుంటున్నారు. ఇలా అయితే వారి మధ్య పదిలంగా ఉండాల్సిన బంధం చేజారిపోతుంది. గోరంత విషయాన్ని కొండంత చేస్తూ గొడవపడటం తప్ప సమస్యను సామరస్యంగా పరిష్కరించే మార్గం మాత్రం వెతకట్లేదు. ఇలా కాకుండా ఉండేందుకు నిపుణులు పలు సలహాలు ఇస్తున్నారు.

మార్చేందుకు కాకుండా.. ముందు మన భాగస్వామి ప్రవర్తన, భావోద్వేగాలు ప్రతి విషయం పూర్తిగా తెలుసుకోండి. వారి గురించి అవగాహన లేకుండానే నాకు నీలో ఈ విషయం నచ్చలేదని వాగ్వాదానికి దిగకుండా ఉంటే సగం సమస్య ఇక్కడే పరిష్కారమవుతుంది.

మాట్లాడండి.. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం మాట్లాడుకోవటం వల్ల వారి మధ్య దూరం పెరగదు. ఉన్న సమయంలోనే ఎంత ఎక్కువ వీలైతే అంత సేపు భాగస్వామితో గడపాలి. వారేం మాట్లాడుతున్నారో విని అర్థం చేసుకున్న తర్వాతే మన స్పందన ఉండాలి. అప్పుడు మీ నిర్ణయాలు సరైనవేనా ఏమైనా మార్చుకోవాలా వారితో పంచుకోండి.

ఇద్దరూ.. ఎప్పుడూ ఒకరే అర్థం చేసుకోవా  లంటే ఆ బంధం నిలబడదు. ఇరువైపుల నుంచి సఖ్యత ఉండాలి. ప్రతిసారి నేనే నెగ్గాలి అనే వైఖరితో కాకుండా ఎలా బంధాన్ని నిలబెట్టుకోవాలి అనే అంశం పై దృష్టి పెట్టాలి. ఇద్దరిలో ఎవరు ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని కచ్చితంగా పూర్తి చేసినప్పుడే భాగస్వామికి మనపై నమ్మకం ఉంటుంది.


మధ్యలో అవి వద్దు.. ఏకాంత సమయం దొరికినప్పుడు మీ వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు, మీ ఇష్టాఅయిష్టాల గురించి చర్చించుకోండి. ఆ సమయంలో టీవీ, ఫోన్లు ఇలాంటివి లేకుండా చూసుకొని ఒత్తిడిని దూరం చేసేలా ప్రశాంతంగా మాట్లాడుకోండి. అంతే మీ బంధం పదికాలాల పాటు చల్లగా ఉంటుందంటున్నారు నిపుణులు..


నిజాయితీ వైపే.. వాదించాల్సి వచ్చినప్పుడు నిజం ఎటుంటే అటే మన వాదన ఉండాలి. తప్పును ఒప్పుకొని అవతలి వ్యక్తిని క్షమాపణ అడిగితే చిన్న గొడవ తుపాను కాకుండా ఆపొచ్చు. కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా నోరుజారతాం. దాంతో సమస్య తీవ్రం అవుతుంది. అవతలి వ్యక్తి బాధ పడిన తర్వాత మనం పశ్చాతాపం చెందినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏదైనా మాట్లాడేముందు కొంచెం సేపు ఆగి, ఆలోచించి మాట్లాడితే సరి.

ఇప్పటి గురించే.. ఒక గొడవ మొదలైనప్పుడు పాత విషయాలు కూడా తవ్వి వాటిని మధ్యలో తీసుకొస్తారు. అలాకాకుండా వాదన ఏం విషయం గురించో దాని గురించే మాట్లాడండి. ఎక్కడి చిరాకునో తెచ్చి భాగస్వామితో గొడవ పడేలాకాకుండా అన్ని బాధ్యతలను సమపాళ్లలో స్వీకరించగలగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్